News October 11, 2025
పాలపిట్టలు ఎక్కడికి పోయాయి?

పల్లెల్లో కనిపించే అందమైన పక్షి పాలపిట్ట. ఈ పిట్ట చెట్ల కొమ్మలపై కూర్చొని కనిపిస్తే కళ్లకు ఎంతో హాయిగా ఉండేది. పొలాల్లో, రోడ్ల పక్కన ఇవి ఎగురుతూ కనిపించేవి. ఇప్పడు ఆ పరిస్థితి లేదు. మొన్న దసరాకి పాలపిట్టను చూడాలని పొలాలన్నీ తిరిగినా కనిపించలేదు. చాలా బాధ అనిపించింది. పంటకు వాడే రసాయనాలు, పొలం గట్లమీద చెట్లను నరికేస్తుండటంతో అవి కూడా మనకు దూరమయ్యాయి. మీరు ఈ మధ్య పాలపిట్టను చూశారా? కామెంట్ చేయండి
Similar News
News October 11, 2025
పేరులో చిన్న మార్పు… కుప్పకూలిన కంపెనీ

పేరులో చిన్న మార్పు ఓ కంపెనీ పతనానికి దారితీసింది. ఢిల్లీకి చెందిన ‘B9 బెవరేజెస్ Pvt Ltd’కి చెందిన Bira91 బీర్లకు పదేళ్లుగా ఎంతో డిమాండ్ ఉండేది. 2024లో IPO కోసం Pvt అనే పదాన్నితొలగించింది. కొత్త పేరుతో వచ్చిన బీర్లు పాత కంపెనీవే అని నమ్మక రాష్ట్రాల్లో నిషేధించారు. ఉత్పత్తీ నిలిచిపోయింది. ₹748 కోట్ల నష్టంతో సిబ్బందికి జీతాలూ చెల్లించలేకపోయింది. కంపెనీ CEO జైన్‌ను తొలగించాలని వారు పిటిషన్ వేశారు.
News October 11, 2025
రేపు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు: APSDMA

AP: దక్షిణ కోస్తాలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపు పలు జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని APSDMA తెలిపింది. అల్లూరి, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు ఆస్కారముందని పేర్కొంది. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News October 11, 2025
వాట్సాప్ బ్లాక్ చేస్తే అరట్టై వాడవచ్చు: సుప్రీంకోర్టు

వాట్సాప్‌కు పోటీగా పేర్కొంటున్న స్వదేశీ మెసేజింగ్ యాప్ ‘అరట్టై’ ప్రస్తావన సుప్రీంకోర్టులో వచ్చింది. వాట్సాప్ ఖాతా పునరుద్ధరణకు సంబంధించి సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. ఎలాంటి కారణం లేకుండా సోషల్ మీడియా నుంచి నిషేధించకుండా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ‘వాట్సాప్ లేకపోతే ప్రత్యామ్నాయంగా స్వదేశీ యాప్ అరట్టై వాడవచ్చు’ అని వ్యాఖ్యానించింది.