News October 11, 2025

సీఐతో వాగ్వాదం.. పేర్ని నానిపై కేసు

image

AP: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నానితో పాటు మరో 29 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్.పేట సీఐ ఏసుబాబుపై దౌర్జన్యం చేశారని చిలకలపూడి PSలో కేసు నమోదైంది. నిన్న మచిలీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనను ఎస్పీ తీవ్రంగా పరిగణించారు. కాగా ఓ కేసులో వైసీపీ నేత సుబ్బన్నను విచారణకు పిలవడంతో వివాదం రాజుకుంది. పేర్ని నాని వచ్చి సీఐతో <<17968702>>వాగ్వాదానికి<<>> దిగారు.

Similar News

News October 11, 2025

పేరులో చిన్న మార్పు… కుప్పకూలిన కంపెనీ

image

పేరులో చిన్న మార్పు ఓ కంపెనీ పతనానికి దారితీసింది. ఢిల్లీకి చెందిన ‘B9 బెవరేజెస్ Pvt Ltd’కి చెందిన Bira91 బీర్లకు పదేళ్లుగా ఎంతో డిమాండ్ ఉండేది. 2024లో IPO కోసం Pvt అనే పదాన్నితొలగించింది. కొత్త పేరుతో వచ్చిన బీర్లు పాత కంపెనీవే అని నమ్మక రాష్ట్రాల్లో నిషేధించారు. ఉత్పత్తీ నిలిచిపోయింది. ₹748 కోట్ల నష్టంతో సిబ్బందికి జీతాలూ చెల్లించలేకపోయింది. కంపెనీ CEO జైన్‌ను తొలగించాలని వారు పిటిషన్ వేశారు.

News October 11, 2025

రేపు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు: APSDMA

image

AP: దక్షిణ కోస్తాలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపు పలు జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని APSDMA తెలిపింది. అల్లూరి, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు ఆస్కారముందని పేర్కొంది. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News October 11, 2025

వాట్సాప్ బ్లాక్ చేస్తే అరట్టై వాడవచ్చు: సుప్రీంకోర్టు

image

వాట్సాప్‌కు పోటీగా పేర్కొంటున్న స్వదేశీ మెసేజింగ్ యాప్ ‘అరట్టై’ ప్రస్తావన సుప్రీంకోర్టులో వచ్చింది. వాట్సాప్ ఖాతా పునరుద్ధరణకు సంబంధించి సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. ఎలాంటి కారణం లేకుండా సోషల్ మీడియా నుంచి నిషేధించకుండా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ‘వాట్సాప్ లేకపోతే ప్రత్యామ్నాయంగా స్వదేశీ యాప్ అరట్టై వాడవచ్చు’ అని వ్యాఖ్యానించింది.