News October 11, 2025

పాల్వంచలో మరో థర్మల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందడుగు

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో మరో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందడుగు పడింది. కొత్తగా ఒకటి లేదా రెండు ప్లాంట్ల ఏర్పాటుపై నివేదిక తయారు చేయాలని జెన్‌కో యాజమాన్యం శుక్రవారం ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేట్ కన్సల్టెన్సీకి బాధ్యతలు అప్పగించింది. 800 మెగావాట్ల సామర్థ్యంతో అల్ట్రా సూపర్‌ క్రిటికల్‌ విధానంలో ఈ ప్లాంట్ ఏర్పాటు కానుంది.

Similar News

News October 11, 2025

చంద్రబాబుకు ప్రధాని మోదీ అభినందనలు

image

సీఎంగా 15 ఏళ్ల మార్కును అధిగమించిన చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఆయన విజన్, సుపరిపాలన పట్ల ఉన్న నిబద్ధత రాజకీయ జీవితంలో స్థిరంగా కొనసాగేలా చేస్తున్నాయని కొనియాడారు. తాను సీఎంగా ఉన్న సమయంలోనూ చంద్రబాబుతో కలిసి పనిచేసినట్లు చెప్పారు. ఏపీ సంక్షేమం కోసం ఉత్సాహంతో పనిచేస్తున్న ఆయనకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు.

News October 11, 2025

ఛార్మీతో రిలేషన్‌పై స్పందించిన పూరీ

image

ఛార్మీతో తనకు ఉన్న అనుబంధంపై దర్శకుడు పూరీ జగన్నాథ్ క్లారిటీ ఇచ్చారు. తనకు 13 ఏళ్ల వయసు నుంచే ఛార్మీ తెలుసని, 20 ఏళ్ల స్నేహంతో తాము కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. పెళ్లైన మహిళతో ఉంటే ఎవరికీ సమస్య ఉండదని, ఛార్మీకి పెళ్లి కాలేదు కాబట్టే తమ మధ్య ఏదో ఉందనుకుంటున్నారని అన్నారు. స్నేహం మాత్రమే శాశ్వతమన్నారు. పూరీ నిర్మాణ సంస్థ ‘పూరీ కనెక్ట్స్’ బాధ్యతలను కొంతకాలంగా ఛార్మీ చూసుకుంటున్నారు.

News October 11, 2025

యానంలో యువకుడి దారుణ హత్య

image

కేంద్రపాలిత ప్రాంతం యానంలో శనివారం దారుణ హత్య జరిగింది. సినిమా హాల్ సెంటర్‌లో గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేయడంతో కాజులూరు మండలానికి చెందిన తిపిరిశెట్టి నారాయణ స్వామి (33) తీవ్రంగా గాయపడ్డాడు. కొన ఊపిరితో ఉన్న అతడిని యానం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.