News October 11, 2025
నల్గొండ: స్పందన కరువు: పెరిగిన ఫీజే కారణం?

జిల్లాలో మద్యం షాపుల దరఖాస్తులకు స్పందన కరువైంది. 2025–27 సంవత్సరానికి 154 దుకాణాలకు గాను ఇప్పటివరకు కేవలం 96 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. 2023లో 155 షాపులకు 7,037 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం దరఖాస్తు ఫీజును భారీగా పెంచడం వల్లే ఈసారి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. గత నెల 26న ఎక్సైజ్ శాఖ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది.
Similar News
News October 12, 2025
NLG: మద్యం దుకాణాలకు 163 దరఖాస్తులు

నల్గొండ జిల్లాలో మద్యం దుకాణాలకు శనివారం మరో 67 దరఖాస్తులు అందినట్లు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి సంతోష్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 154 మద్యం దుకాణాలు ఉండగా.. నేటి వరకు 163 దరఖాస్తులు అందాయని తెలిపారు. ఈనెల 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. .
News October 12, 2025
నల్గొండ: లిఫ్ట్ ప్రమాదంలో ఉద్యోగి దుర్మరణం

NLG అబ్బాయ్య కాలనీలోని ఖాజా మంజీల్ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ ప్రమాదం జరిగి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి ఖాజా మొయినుద్దీన్ మృతి చెందాడు. లిఫ్ట్ డోర్ తెరుచుకోవడంతో రెండో అంతస్తు నుంచి కిందపడిపోయిన మొయినుద్దీన్‌పై లిఫ్ట్ పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News October 11, 2025
మిర్యాలగూడలో వ్యభిచార గృహంపై దాడి

మిర్యాలగూడ హౌసింగ్ బోర్డు కాలనీలో వ్యభిచార గృహంపై వన్ టౌన్ పోలీసులు దాడులు చేశారు. ఇద్దరు నిర్వాహకులు, ఒక మహిళ, ఒక విటుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు బైకులు, రెండు సెల్‌ఫోన్లు, రూ.1,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.