News October 11, 2025
మహిళా జర్నలిస్టులకు నో ఇన్విటేషన్.. PM సమాధానం చెప్పాలన్న ప్రియాంక

అఫ్గాన్ మినిస్టర్ ముత్తాఖీ INDలో నిర్వహించిన <<17971661>>ప్రెస్‌మీట్‌కు<<>> మహిళా జర్నలిస్టులను ఆహ్వానించకపోవడంపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని PM మోదీని MP ప్రియాంకా గాంధీ కోరారు. ‘దేశానికి మహిళలు వెన్నెముకలాంటి వారు. వారిని ఎలా అవమానిస్తారు? ఎన్నికల సమయంలోనే మహిళల హక్కులను గుర్తిస్తారా’ అని ప్రశ్నించారు. కాగా ఈ ప్రెస్‌మీట్‌తో తమకు సంబంధం లేదని IND విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
Similar News
News October 11, 2025
వాట్సాప్ బ్లాక్ చేస్తే అరట్టై వాడవచ్చు: సుప్రీంకోర్టు

వాట్సాప్‌కు పోటీగా పేర్కొంటున్న స్వదేశీ మెసేజింగ్ యాప్ ‘అరట్టై’ ప్రస్తావన సుప్రీంకోర్టులో వచ్చింది. వాట్సాప్ ఖాతా పునరుద్ధరణకు సంబంధించి సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. ఎలాంటి కారణం లేకుండా సోషల్ మీడియా నుంచి నిషేధించకుండా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ‘వాట్సాప్ లేకపోతే ప్రత్యామ్నాయంగా స్వదేశీ యాప్ అరట్టై వాడవచ్చు’ అని వ్యాఖ్యానించింది.
News October 11, 2025
కల్తీ కాఫ్ సిరప్‌లపై US ఆరా

మన దేశంలో 22 మంది పిల్లల మృతికి కారణమైన కల్తీ దగ్గు మందులపై US ఆరా తీసింది. కోల్డ్రిఫ్ సిరప్ అమెరికా సహ ఏ దేశానికీ పంపలేదని US FDAకు CDSCO (IND) తెలిపిందని రాయిటర్స్ పేర్కొంది. పరిమితికి మించి 500 రెట్ల విషపూరితమైన కాఫ్ సిరప్ వల్ల పిల్లలు మరణించారని తెలిపింది. ‘ఆ మందులు USలోకి రాకుండా అప్రమత్తంగా ఉన్నాం. ఇక్కడకి వచ్చే మందులు అత్యున్నత ప్రమాణాలతో ఉండాలని చెప్పాం’ అని FDA పేర్కొన్నట్లు వివరించింది.
News October 11, 2025
బొత్సకు వైసీపీ నుంచే ప్రాణహాని: పల్లా

AP: వైసీపీ ఎమ్మెల్సీ <<17973709>>బొత్స<<>> సత్యనారాయణకు కూటమి నుంచి ఎలాంటి ప్రాణహాని లేదని TDP చీఫ్ పల్లా శ్రీనివాస్ అన్నారు. ఆయనకు సొంత పార్టీ నుంచే ప్రాణహాని ఉండొచ్చని కౌంటర్ ఇచ్చారు. ఈ విషయాన్ని బొత్స చెప్పుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. మండలిలో బొత్స కొంత రాణించే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే జగన్ నుంచి ప్రాణహాని ఉండొచ్చని పేర్కొన్నారు. బొత్స భద్రత కావాలని కోరితే CM నిర్ణయం తీసుకుంటారన్నారు.