News October 11, 2025
గుడ్ ఐడియా.. పూల అమ్మకానికి సోషల్ మీడియా

పంట దిగుబడి బాగున్నా.. కొనేవారు లేక రైతులు ఇబ్బంది పడుతుంటారు. దీనికి పరిష్కారంగా పంట అమ్మకానికి కొందరు రైతులు సోషల్ మీడియాను వేదికగా మార్చుకుంటున్నారు. పూలు తెంపే 2,3 రోజుల ముందే ఫేస్‌బుక్, వాట్సాప్ గ్రూపుల్లో సమాచారం పోస్టు చేస్తున్నారు. ఇది చూసి ఊరి జనం, చుట్టుపక్కల గ్రామాలవారు నేరుగా ఈ రైతులను సంప్రదించి.. తోటల నుంచే తాజా పూలను కొంటున్నారు. మిగిలిన వాటిని పెద్ద వ్యాపారులకు విక్రయిస్తున్నారు.
Similar News
News October 11, 2025
రేపు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు: APSDMA

AP: దక్షిణ కోస్తాలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపు పలు జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని APSDMA తెలిపింది. అల్లూరి, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు ఆస్కారముందని పేర్కొంది. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News October 11, 2025
వాట్సాప్ బ్లాక్ చేస్తే అరట్టై వాడవచ్చు: సుప్రీంకోర్టు

వాట్సాప్‌కు పోటీగా పేర్కొంటున్న స్వదేశీ మెసేజింగ్ యాప్ ‘అరట్టై’ ప్రస్తావన సుప్రీంకోర్టులో వచ్చింది. వాట్సాప్ ఖాతా పునరుద్ధరణకు సంబంధించి సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. ఎలాంటి కారణం లేకుండా సోషల్ మీడియా నుంచి నిషేధించకుండా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ‘వాట్సాప్ లేకపోతే ప్రత్యామ్నాయంగా స్వదేశీ యాప్ అరట్టై వాడవచ్చు’ అని వ్యాఖ్యానించింది.
News October 11, 2025
కల్తీ కాఫ్ సిరప్‌లపై US ఆరా

మన దేశంలో 22 మంది పిల్లల మృతికి కారణమైన కల్తీ దగ్గు మందులపై US ఆరా తీసింది. కోల్డ్రిఫ్ సిరప్ అమెరికా సహ ఏ దేశానికీ పంపలేదని US FDAకు CDSCO (IND) తెలిపిందని రాయిటర్స్ పేర్కొంది. పరిమితికి మించి 500 రెట్ల విషపూరితమైన కాఫ్ సిరప్ వల్ల పిల్లలు మరణించారని తెలిపింది. ‘ఆ మందులు USలోకి రాకుండా అప్రమత్తంగా ఉన్నాం. ఇక్కడకి వచ్చే మందులు అత్యున్నత ప్రమాణాలతో ఉండాలని చెప్పాం’ అని FDA పేర్కొన్నట్లు వివరించింది.