News October 11, 2025

‘చిత్త కార్తె’ అంటే ఏంటి?

image

జ్యోతిష శాస్త్రం ప్రకారం అశ్విని నుంచి రేవతి వరకు 27 నక్షత్రాలు ఉన్నాయి. సూర్యుడు ప్రతి నక్షత్రంలో 13-14 రోజులు ఉంటాడు. ఏ నక్షత్రంలోకి ప్రవేశిస్తే ఆ కాలాన్ని ఆ కార్తె పేరుతో అని పిలుస్తారు. సమస్త ప్రాణకోటితో పాటు ప్రకృతి ప్రవర్తనలపై ఇవి ప్రభావం చూపుతాయి. భానుడు ఇవాళ చిత్త నక్షత్రంలోకి ప్రవేశిస్తుండటంతో చిత్త కార్తె ప్రారంభం అవుతోంది.
* ఇలాంటి ఆసక్తికర కంటెంట్ కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.

Similar News

News October 11, 2025

చంద్రబాబుకు ప్రధాని మోదీ అభినందనలు

image

సీఎంగా 15 ఏళ్ల మార్కును అధిగమించిన చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఆయన విజన్, సుపరిపాలన పట్ల ఉన్న నిబద్ధత రాజకీయ జీవితంలో స్థిరంగా కొనసాగేలా చేస్తున్నాయని కొనియాడారు. తాను సీఎంగా ఉన్న సమయంలోనూ చంద్రబాబుతో కలిసి పనిచేసినట్లు చెప్పారు. ఏపీ సంక్షేమం కోసం ఉత్సాహంతో పనిచేస్తున్న ఆయనకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు.

News October 11, 2025

ఛార్మీతో రిలేషన్‌పై స్పందించిన పూరీ

image

ఛార్మీతో తనకు ఉన్న అనుబంధంపై దర్శకుడు పూరీ జగన్నాథ్ క్లారిటీ ఇచ్చారు. తనకు 13 ఏళ్ల వయసు నుంచే ఛార్మీ తెలుసని, 20 ఏళ్ల స్నేహంతో తాము కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. పెళ్లైన మహిళతో ఉంటే ఎవరికీ సమస్య ఉండదని, ఛార్మీకి పెళ్లి కాలేదు కాబట్టే తమ మధ్య ఏదో ఉందనుకుంటున్నారని అన్నారు. స్నేహం మాత్రమే శాశ్వతమన్నారు. పూరీ నిర్మాణ సంస్థ ‘పూరీ కనెక్ట్స్’ బాధ్యతలను కొంతకాలంగా ఛార్మీ చూసుకుంటున్నారు.

News October 11, 2025

AIకి అధిక విద్యుత్ ఎందుకు అవసరం?

image

AI, డీప్ లెర్నింగ్ మోడల్స్ చేసే కాలిక్యులేషన్స్‌కు GPU, TPUల వంటి హై-పవర్ హార్డ్‌వేర్‌ అవసరం అవుతుంది. ఆ హార్డ్‌వేర్‌, వాటి నుంచి వచ్చే వేడిని తగ్గించడానికి కూలింగ్ వ్యవస్థలూ <<17977805>>హైపవర్‌<<>>ను డిమాండ్ చేస్తాయి. పెద్ద AI మోడల్స్ శిక్షణకు వేల గంటల పాటు హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ అవసరం అవుతుంది. అలాగే డేటా సెంటర్లలోని సర్వర్లు, నెట్‌వర్కింగ్ సామగ్రికీ.. 24/7 AI సేవలకు అధిక విద్యుత్ కావాల్సి ఉంటుంది.