News October 11, 2025
HYD: జిల్లా అధ్యక్షుల భర్తీకి కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు..!

రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పార్టీ అధ్యక్షుల భర్తీకి తెలంగాణ ప్రదేశం కాంగ్రెస్ కమిటీ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. ఇవాళ్టి నుంచి డీసీసీ అధ్యక్ష పదవులకు దరఖాస్తులను అధిష్ఠాన పెద్దలు స్వీకరించనున్నారు. వారం రోజులపాటు ఏఐసీసీ పరిశీలకులు పరిశీలించనున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి జిల్లా అధ్యక్షులను బలమైన నేతలు పెట్టేందుకు ఏఐసీసీ గ్రౌండ్ లెవెల్‌లో పనిచేస్తుంది.
Similar News
News October 12, 2025
సుంకేసుల మూడు గేట్లు ఓపెన్

రాజోలి మండలంలోని సుంకేసుల బ్యారేజీ మూడు గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు వదులుతున్నారు. కర్ణాటక ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల నిలిపివేయడంతో సుంకేసుల బ్యారేజీకి వరద ప్రవాహం తగ్గింది. ఆదివారం బ్యారేజీకి ఇన్ ఫ్లో 15,250 క్యూసెక్కులు వస్తోంది. గేట్ల ద్వారా 11,156 క్యూసెక్కులు, కేసీ కెనాల్ ద్వారా 2,445 క్యూసెక్కులు, మొత్తం 13,601 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
News October 12, 2025
గజ్వేల్: పెళ్లయిన 13 రోజులకే గర్భం.. ఇద్దరిపై పోక్సో కేసు

గజ్వేల్ పరిధిలో ఇద్దరిపై పోక్సో కేసు నమోదైంది. SI విజయ్ కుమార్ తెలిపిన వివరాలు.. ములుగు(M) ఓ గ్రామానికి చెందిన యువతికి SEP25న పెళ్లవగా అత్తింటికి వెళ్లింది. 3రోజులుగా ఆమెకు కడుపు నొప్పి రావడంతో పుట్టింటికి వెళ్లింది. అనుమానంతో పరీక్ష చేయించగా గర్భం దాల్చినట్లు తేలింది. పెళ్లయిన 13రోజులకే ఈపరిస్థితి ఏంటని ప్రశ్నించగా గ్రామానికి చెందిన ఉదయ్ కిరణ్, పవన్ కళ్యాణ్ తనను లొంగదీసుకున్నారని యువతి పేర్కొంది.
News October 12, 2025
యానంలో దారుణ హత్య.. UPDATE

యానంలో శనివారం సాయంత్రం దారుణ హత్య జరిగింది. మూడేళ్ల క్రితం తన తండ్రి (మోకా వెంకటేశ్వరరావు) మృతికి కారణమైన చీటీల వ్యాపారి నారాయణస్వామిని వెంకటేశ్వరరావు తనయుడు ఆనంద్ హత్య చేసినట్లు ఎస్పీ వరదరాజన్ పేర్కొన్నారు. నారాయణస్వామిని ఆనంద్ 10 సార్లు పొడిచినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆనంద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.