News October 11, 2025

విశాఖలో సిఫీ డేటా సెంటర్‌కు శంకుస్థాపన

image

మంత్రి నారా లోకేశ్ రేపు విశాఖ రానున్నారు. ఉదయం 9 గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని అక్కడ నుంచి రుషికొండకు వెళ్తారు. SIFY డేటా సెంటర్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అక్కడ నుంచి ఎన్‌టీఆర్ భవన్‌కు చేరుకొని ముఖ్య నేతలతో సమిక్షిస్తారు. సాయంత్రం మూడు గంటలకు మధురవాడ స్టేడియంకు వెళ్లి క్రికెట్ మ్యాచ్‌ను విక్షిస్తారు. రాత్రి 11:40కు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని విజయవాడ వెళ్తారు.

Similar News

News October 11, 2025

VZM: పెళ్లి ఇష్టం లేదని యువతి ఆత్మహత్య

image

వివాహం చేసుకోమని ఆమె తల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతో అయ్యకోనేరు గట్టు చెరువులో పడి యువతి ఆత్మహత్య చేసుకుంది. టౌన్ ఎస్ఐ కనకరాజు తెలిపిన వివరాల ప్రకారం.. బెహరా రమ్య(18) డిగ్రీ చదువుతోంది. వివాహం చేస్తామని ఆమెకు చెప్పగా ముందు తన అన్నయ్యకు చేయమంది. వినకుండా బలవంతం చేయడంతో శుక్రవారం రాత్రి ఇళ్లు వదిలి వెళ్లిందన్నారు. ఈరోజు చెరువులో మృతదేహం తేలడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

News October 11, 2025

చంద్రబాబుకు ప్రధాని మోదీ అభినందనలు

image

సీఎంగా 15 ఏళ్ల మార్కును అధిగమించిన చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఆయన విజన్, సుపరిపాలన పట్ల ఉన్న నిబద్ధత రాజకీయ జీవితంలో స్థిరంగా కొనసాగేలా చేస్తున్నాయని కొనియాడారు. తాను సీఎంగా ఉన్న సమయంలోనూ చంద్రబాబుతో కలిసి పనిచేసినట్లు చెప్పారు. ఏపీ సంక్షేమం కోసం ఉత్సాహంతో పనిచేస్తున్న ఆయనకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు.

News October 11, 2025

ఛార్మీతో రిలేషన్‌పై స్పందించిన పూరీ

image

ఛార్మీతో తనకు ఉన్న అనుబంధంపై దర్శకుడు పూరీ జగన్నాథ్ క్లారిటీ ఇచ్చారు. తనకు 13 ఏళ్ల వయసు నుంచే ఛార్మీ తెలుసని, 20 ఏళ్ల స్నేహంతో తాము కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. పెళ్లైన మహిళతో ఉంటే ఎవరికీ సమస్య ఉండదని, ఛార్మీకి పెళ్లి కాలేదు కాబట్టే తమ మధ్య ఏదో ఉందనుకుంటున్నారని అన్నారు. స్నేహం మాత్రమే శాశ్వతమన్నారు. పూరీ నిర్మాణ సంస్థ ‘పూరీ కనెక్ట్స్’ బాధ్యతలను కొంతకాలంగా ఛార్మీ చూసుకుంటున్నారు.