News October 11, 2025

రాష్ర్ట స్థాయికి రామడుగు మోడల్ స్కూల్ విద్యార్థులు

image

రామడుగు మోడల్ స్కూల్ విద్యార్థులు జిల్లాస్థాయి జానపద నృత్య పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతి సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎస్వీఆర్టీ ఆధ్వర్యంలో కళాభారతిలో ఈ పోటీలు జరిగాయి. విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించిన గైడ్ ఉపాధ్యాయుడు రత్నాకర్ కృషిని పాఠశాల ప్రిన్సిపల్ ఆడెపు మనోజ్ కుమార్ ప్రశంసించారు. విద్యార్థులను డీఈఓ మొండయ్య అభినందించారు.

Similar News

News October 11, 2025

కరీంనగర్: DCC రేసులో ఎవరెవరున్నారు?

image

KNR <<17974062>>DCC అధ్యక్షుడి రేసులో<<>> సుడా ఛైర్మన్ నరేందర్ రెడ్డి, రాజేందర్ రావు, పద్మాకర్ రెడ్డి, శ్రీరామ చక్రవర్తి, వైద్యుల అంజన్ కుమార్‌తో పాటు పలువురు పోటీపడుతున్నారు. సిరిసిల్ల నుంచి సంగీతం శ్రీనివాస్ రావు, చక్రధర్ రెడ్డి, గడ్డం నర్సయ్య ఆశిస్తున్నారు. జగిత్యాల నుంచి సుజిత్ రావు, జువ్వాడి కృష్ణారావు, కరంచంద్ ప్రయత్నిస్తున్నారు. పెద్దపల్లి నుంచి తిరుపతియాదవ్, సదానందం, శశిభూషణ్, సారయ్యగౌడ్ రేసులో ఉన్నారు.

News October 11, 2025

కరీంనగర్: టిక్కెట్లు ఇచ్చేది బీజేపీ నాయకత్వం

image

బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకత్వం నిర్ణయం మేరకే స్థానిక సంస్థల టికెట్లు కేటాయిస్తామని కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఏ ఒక్క వ్యక్తి ప్రమేయంతో బీజేపీలో టికెట్లు రావన్నారు. పార్టీలో గ్రూపులు, వర్గాలు, అనుచరులకు టికెట్లు, బీ ఫామ్‌లు ఇచ్చే సంప్రదాయం బీజేపీలో ఉండదని స్పష్టం చేశారు.

News October 11, 2025

కరీంనగర్‌లో ఈనెల15 న జాబ్ మేళా

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నిరుద్యోగులకు ఈ నెల 15న జాబ్ మేళా నిర్వహిస్తునట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు తెలిపారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసి వయస్సు 25-30 లోపు ఉండాలని.. ఆసక్తిగల వారు ఉపాధి కార్యాలయంలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.