News October 11, 2025
ధనధాన్య కృషి యోజన పథకం ప్రారంభం

దేశంలోని వ్యవసాయ రంగ ఉత్పాదకతను పెంచేందుకు ధనధాన్య కృషి యోజన పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. జాతీయ సగటుకంటే పంట ఉత్పాదకత తక్కువ ఉన్న 100 జిల్లాలను ఈ పథకం కింద ఎంపిక చేశారు. ఈ జిల్లాల్లో సాగునీటి సామర్థ్యం, పంట నిల్వ, రుణ సదుపాయం, పంటమార్పిడి, సాగులో వైవిధ్యం పెంచడానికి కేంద్రం ఏటా రూ.24 వేల కోట్ల చొప్పున ఆరేళ్లు ఖర్చు చేస్తుంది. దీని వల్ల 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి కలుగుతుంది.
Similar News
News October 12, 2025
డ్రోన్ దాడుల్లో 60 మంది మృతి!

ఆఫ్రికా దేశం సూడాన్‌లో పారామిలిటరీ ర్యాపిడ్ ఫోర్సెస్ రెచ్చిపోయాయి. నార్త్ డార్ఫర్ సిటీలోని షెల్టర్‌పై జరిపిన డ్రోన్ దాడుల్లో 60 మంది వరకు మరణించారు. వీరిలో చిన్నారులు, మహిళలే సగానికి పైగా ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. 2023 నుంచి ఆర్మీతో పారామిలిటరీ ఘర్షణలు కొనసాగిస్తోంది. ఇందులో వేల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.
News October 12, 2025
ప్రతి కుటుంబానికి మెరుగైన జీవనోపాధే లక్ష్యం: చంద్రబాబు

AP: ప్రతి కుటుంబానికి మెరుగైన ఆదాయం, జీవనోపాధి కల్పించే లక్ష్యంతో పని చేస్తున్నామని CM CBN తెలిపారు. NLRలో స్మార్ట్ స్ట్రీట్‌ను వర్చువల్‌గా ప్రారంభించి మాట్లాడారు. ‘రూ.7కోట్లతో ఈ దుకాణాలను ఏర్పాటు చేశాం. ఇక్కడ దుకాణాలు పొంది 120మంది ఎంట్రప్రెన్యూర్‌లయ్యారు. మహిళలు, దివ్యాంగులు, వెనకబడిన వర్గాలకు వీటిని కేటాయించాం. ప్రతి ఇంటా చిరు వ్యాపారమో, చిరు పరిశ్రమనో స్థాపించేలా చూస్తున్నాం’ అని వివరించారు.
News October 11, 2025
నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు యాప్: CBN

AP: నకిలీ మద్యం గుర్తించడానికి త్వరలో యాప్ తీసుకొస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ఎక్సైజ్‌శాఖపై సమీక్ష నిర్వహించారు. యాప్ ద్వారా మద్యం బాటిల్‌పై హోలోగ్రామ్ స్కాన్ చేస్తే మద్యం అసలైందో నకిలీదో తెలుస్తుందన్నారు. గత ప్రభుత్వం నకిలీ మద్యాన్ని ప్రోత్సహించి, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిందని ఫైరయ్యారు. నకిలీ మద్యం వ్యవహారంలో TDP నేతలను సస్పెండ్ చేశామని తెలిపారు.