News October 11, 2025
BREAKING: జూబ్లీహిల్స్‌లో BJP కీలక నేత రాజీనామా

BJP జూబ్లీహిల్స్ నియోజకవర్గ మాజీ జాయింట్ కన్వీనర్ చెర్క మహేశ్ ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. CM రేవంత్ రెడ్డి, BJP గుట్టుచప్పుడు కాకుండా చేతులు కలిపి తెలంగాణను మోసం చేస్తున్నారని ఆరోపించారు. BJP, కాంగ్రెస్ కలిసి బీసీ రిజర్వేషన్ల విషయంలోనూ ప్రజలను మోసం చేశారని, రైతులు, యువత, మహిళలు, బీసీలు బాధలో ఉన్నా BJP మౌనంగా ఉందని, ఇక తాను పార్టీలో కొనసాగలేనని TBJP చీఫ్ రాంచందర్‌రావుకు లేఖ రాశారు.
Similar News
News October 12, 2025
CP సజ్జనార్‌తో మెగాస్టార్ చిరంజీవి

నగరానికి నూతన CPగా ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్‌ను ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. బంజారాహిల్స్‌లోని పోలీస్ కమిషనరేట్‌లో CPతో భేటీ అయ్యారు. ఇరువురి మీటింగ్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

నల్గొండ: లిఫ్ట్ ప్రమాదంలో ఉద్యోగి దుర్మరణం

NLG అబ్బాయ్య కాలనీలోని ఖాజా మంజీల్ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ ప్రమాదం జరిగి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి ఖాజా మొయినుద్దీన్ మృతి చెందాడు. లిఫ్ట్ డోర్ తెరుచుకోవడంతో రెండో అంతస్తు నుంచి కిందపడిపోయిన మొయినుద్దీన్‌పై లిఫ్ట్ పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.