News October 11, 2025

విషపూరిత దగ్గు మందు.. తమిళనాడు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే: CDSCO

image

మధ్యప్రదేశ్‌లో 23 మంది పిల్లల మరణాలకు తమిళనాడు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) పేర్కొన్నట్లు NDTV తెలిపింది. కోల్డ్రిఫ్ సిరప్ తయారు చేసే ‘Sresan’ కంపెనీలో తనిఖీలు చేయలేదని, దీనివల్ల ఆ విషపూరితమైన సిరప్ మార్కెట్లోకి వచ్చిందని చెప్పింది. ఆ సంస్థలో అసలు ఆడిట్ జరగలేదని, సెంట్రల్ పోర్టల్‌లోనూ రిజిస్టర్ కాలేదని వెల్లడించింది.

Similar News

News October 11, 2025

రిమాండ్ రిపోర్ట్: మద్యం బాటిళ్లకు ఫినాయిల్ స్టిక్కర్లు!

image

AP: నకిలీ మద్యం కేసులో అరెస్టైన <<17969515>>జనార్దన్‌రావు<<>> రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగు చూసినట్లు సమాచారం. ‘నిందితుడు 2012లో మద్యం వ్యాపారం స్టార్ట్ చేసి కరోనాతో ఆర్థికంగా నష్టపోయాడు. 2021 నుంచి HYDలో నకిలీ మద్యం తయారు చేస్తున్నాడు. ప్లాస్టిక్ డబ్బాల్లో లిక్కర్ పోసి డౌట్ రాకుండా ఫినాయిల్ స్టిక్కర్లు వేసేవాడు. ఆపై ఇబ్రహీంపట్నం ANR బార్‌కు తెచ్చి విక్రయించేవాడు’ అని పేర్కొన్నట్లు తెలుస్తోంది.

News October 11, 2025

2,253 పదాలతో పేరు.. గిన్నిస్ రికార్డు

image

మీ పేరులో ఎన్ని పదాలు ఉంటాయి. గరిష్ఠంగా అయితే 7-10 వరకు ఉండొచ్చు. కానీ న్యూజిలాండ్‌కు చెందిన లారెన్స్ పేరు ఏకంగా 2,253 పదాలతో ఉంది. రికార్డుల కోసం కొందరు చేసే విచిత్రమైన పనులను చూసి తనకు ఈ ఆసక్తి కలిగిందని లారెన్స్ తెలిపారు. 1990లో పేరును 2వేలకు పైగా పదాలకు పెంచుకొనేందుకు కోర్టును ఆశ్రయించగా ఇటీవల అనుమతి వచ్చింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత పెద్ద పేరు కలిగిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డుల్లోకెక్కాడు.

News October 11, 2025

చంద్రబాబుకు ప్రధాని మోదీ అభినందనలు

image

సీఎంగా 15 ఏళ్ల మార్కును అధిగమించిన చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఆయన విజన్, సుపరిపాలన పట్ల ఉన్న నిబద్ధత రాజకీయ జీవితంలో స్థిరంగా కొనసాగేలా చేస్తున్నాయని కొనియాడారు. తాను సీఎంగా ఉన్న సమయంలోనూ చంద్రబాబుతో కలిసి పనిచేసినట్లు చెప్పారు. ఏపీ సంక్షేమం కోసం ఉత్సాహంతో పనిచేస్తున్న ఆయనకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు.