News October 11, 2025
గ్రేటర్ HYDలో 14,112 గుంతలు పూడ్చి వేసినట్లు ప్రకటన

గ్రేటర్ HYD వ్యాప్తంగా 16,541 గుంతలు ఉన్నాయని గుర్తించిన అధికారులు, ఇప్పటి వరకు రోడ్లపై 14,112 గుంతలు పూడ్చివేసినట్లుగా తెలిపారు. రోడ్డు సేఫ్టీ చర్యలు వేగంగా చేపడుతున్నట్లు GHMC వివరించింది. జోన్ల వారీగా ఎల్.బీ. నగర్ జోన్ 2,743, చార్మినార్ జోన్ 2,235, ఖైరతాబాద్ 1,987, శేరిలింగంపల్లి 1,576, కూకట్‌పల్లి 2,308, సికింద్రాబాద్ జోన్‌లో 3,263 గుంతలు పూడ్చినట్లు రిపోర్ట్‌ను విడుదల చేసింది.
Similar News
News October 12, 2025
VKB: బాలికలు.. క్రీడల్లో మహారాణులు

వికారాబాద్ జిల్లా పుట్టపాడు హై స్కూల్‌కి చెందిన బాలికలు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తున్నారు. ఈ పాఠశాలకు చెందిన బాలికలు కబడ్డీ అండర్-14 బాలికల విభాగంలో పరిగి జోన్‌లో విజేతగా నిలిచారు. వసుధా రెడ్డి, మదిహా ఫాతిమా, అక్షిత జిల్లాస్థాయిలో రాణించి, ప్రతిభ చాటారు. PD ప్రణవి ప్రోత్సాహంతో విద్యార్థులు అన్ని క్రీడల్లో రాణిస్తున్నారు. నేడు అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా.. Way2News ప్రత్యేక కథనం.
News October 12, 2025
కాలుష్య నియంత్రణ చర్యలు దేశానికి మోడల్ కావాలి: పవన్

AP: పకడ్బందీ ప్రణాళికతో కాకినాడ(D) తీర ప్రాంత కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని Dy.CM పవన్ అధికారులను ఆదేశించారు. ‘ఉప్పాడ తీర ప్రాంతంలో పరిస్థితులపై అధ్యయనం చేయండి. 100రోజుల ప్రణాళికతో జాలర్ల సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించండి. మనం తీసుకోబోయే కాలుష్య నియంత్రణ చర్యలు దేశానికి మోడల్ కావాలి. వ్యర్థాలను శుద్ధి ప్రక్రియలో అధునాతన సాంకేతికతను పరిశ్రమలు వినియోగించాలి’ అని తెలిపారు.
News October 12, 2025
HYD: DON’T MISS.. రేపు ఉ.7 గంటలకు పోలియో చుక్కలు

HYD, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సహా అనేక చోట్ల అక్టోబర్ 12న ఉదయం 7 గంటలకు పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభం అవుతుందని డాక్టర్ సౌశీల్య తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. 0-5 ఏళ్ల వయసు ఉన్న వారందరికీ పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. అక్టోబర్ 13వ తేదీన హౌస్ టు హౌస్ ప్రోగ్రాం నిర్వహిస్తారు.