News October 11, 2025
భారత్ 518/5 డిక్లేర్

WIతో జరుగుతోన్న రెండో టెస్టులో భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 134.2 ఓవర్లలో టీమ్ ఇండియా 518/5 రన్స్ చేసింది. ఓపెనర్ జైస్వాల్ (175), గిల్ (129*) సెంచరీలతో రాణించారు. కేఎల్ రాహుల్ 38, సాయి సుదర్శన్ 87, నితీశ్ కుమార్ రెడ్డి 43, జురెల్ 44 రన్స్ చేశారు.
Similar News
News October 12, 2025
కాలుష్య నియంత్రణ చర్యలు దేశానికి మోడల్ కావాలి: పవన్

AP: పకడ్బందీ ప్రణాళికతో కాకినాడ(D) తీర ప్రాంత కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని Dy.CM పవన్ అధికారులను ఆదేశించారు. ‘ఉప్పాడ తీర ప్రాంతంలో పరిస్థితులపై అధ్యయనం చేయండి. 100రోజుల ప్రణాళికతో జాలర్ల సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించండి. మనం తీసుకోబోయే కాలుష్య నియంత్రణ చర్యలు దేశానికి మోడల్ కావాలి. వ్యర్థాలను శుద్ధి ప్రక్రియలో అధునాతన సాంకేతికతను పరిశ్రమలు వినియోగించాలి’ అని తెలిపారు.
News October 12, 2025
డ్రోన్ దాడుల్లో 60 మంది మృతి!

ఆఫ్రికా దేశం సూడాన్‌లో పారామిలిటరీ ర్యాపిడ్ ఫోర్సెస్ రెచ్చిపోయాయి. నార్త్ డార్ఫర్ సిటీలోని షెల్టర్‌పై జరిపిన డ్రోన్ దాడుల్లో 60 మంది వరకు మరణించారు. వీరిలో చిన్నారులు, మహిళలే సగానికి పైగా ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. 2023 నుంచి ఆర్మీతో పారామిలిటరీ ఘర్షణలు కొనసాగిస్తోంది. ఇందులో వేల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.
News October 12, 2025
ప్రతి కుటుంబానికి మెరుగైన జీవనోపాధే లక్ష్యం: చంద్రబాబు

AP: ప్రతి కుటుంబానికి మెరుగైన ఆదాయం, జీవనోపాధి కల్పించే లక్ష్యంతో పని చేస్తున్నామని CM CBN తెలిపారు. NLRలో స్మార్ట్ స్ట్రీట్‌ను వర్చువల్‌గా ప్రారంభించి మాట్లాడారు. ‘రూ.7కోట్లతో ఈ దుకాణాలను ఏర్పాటు చేశాం. ఇక్కడ దుకాణాలు పొంది 120మంది ఎంట్రప్రెన్యూర్‌లయ్యారు. మహిళలు, దివ్యాంగులు, వెనకబడిన వర్గాలకు వీటిని కేటాయించాం. ప్రతి ఇంటా చిరు వ్యాపారమో, చిరు పరిశ్రమనో స్థాపించేలా చూస్తున్నాం’ అని వివరించారు.