News October 11, 2025

ADB: హస్తానికి కొత్త సారథి.. ఎవరవుతారో మరి?

image

జిల్లాలో కాంగ్రెస్‌కు త్వరలో కొత్త సారథి రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేశాడని అప్పటి అధ్యక్షుడు సాజీద్ ఖాన్‌ను సస్పెండ్ చేశారు. రెండేళ్లుగా పదవి ఖాళీగానే ఉంది. అందరిని కలుపుకొనిపోయే వాళ్ల కోసం అధిష్ఠానం వెతుకుతోంది. AICC పరిశీలకుడు జిల్లాలో పర్యటించి నివేదిక అందజేయనున్నారు. కంది శ్రీనివాసరెడ్డి, గోక గణేశ్ రెడ్డి, బోరంచు శ్రీకాంత్ రెడ్డి, సోయం పేర్లు వినిపిస్తున్నాయి.

Similar News

News October 12, 2025

VKB: బాలికలు.. క్రీడల్లో మహారాణులు

image

వికారాబాద్ జిల్లా పుట్టపాడు హై స్కూల్‌కి చెందిన బాలికలు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తున్నారు. ఈ పాఠశాలకు చెందిన బాలికలు కబడ్డీ అండర్-14 బాలికల విభాగంలో పరిగి జోన్‌లో విజేతగా నిలిచారు. వసుధా రెడ్డి, మదిహా ఫాతిమా, అక్షిత జిల్లాస్థాయిలో రాణించి, ప్రతిభ చాటారు. PD ప్రణవి ప్రోత్సాహంతో విద్యార్థులు అన్ని క్రీడల్లో రాణిస్తున్నారు. నేడు అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా.. Way2News ప్రత్యేక కథనం.

News October 12, 2025

కాలుష్య నియంత్రణ చర్యలు దేశానికి మోడల్ కావాలి: పవన్

image

AP: పకడ్బందీ ప్రణాళికతో కాకినాడ(D) తీర ప్రాంత కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని Dy.CM పవన్ అధికారులను ఆదేశించారు. ‘ఉప్పాడ తీర ప్రాంతంలో పరిస్థితులపై అధ్యయనం చేయండి. 100రోజుల ప్రణాళికతో జాలర్ల సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించండి. మనం తీసుకోబోయే కాలుష్య నియంత్రణ చర్యలు దేశానికి మోడల్ కావాలి. వ్యర్థాలను శుద్ధి ప్రక్రియలో అధునాతన సాంకేతికతను పరిశ్రమలు వినియోగించాలి’ అని తెలిపారు.

News October 12, 2025

HYD: DON’T MISS.. రేపు ఉ.7 గంటలకు పోలియో చుక్కలు

image

HYD, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సహా అనేక చోట్ల అక్టోబర్ 12న ఉదయం 7 గంటలకు పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభం అవుతుందని డాక్టర్ సౌశీల్య తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. 0-5 ఏళ్ల వయసు ఉన్న వారందరికీ పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. అక్టోబర్ 13వ తేదీన హౌస్ టు హౌస్ ప్రోగ్రాం నిర్వహిస్తారు.