News October 11, 2025
రామగిరి: హత్య కేసులో నిందితుల అరెస్ట్

రామాగిరి సెంటినరీకాలనీలో కోట చిరంజీవిని హత్య చేసిన నిందితుల్ని శనివారం అరెస్టు చేసినట్లు గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ గౌడ్ తెలిపారు. పెంచికల్ పేట్‌కు చెందిన సంధ్యా రాణిని చిరంజీవి వేధిస్తుండటంతో కుటుంబ సభ్యులకు తెలిపింది. వేధింపులు ఎక్కువ కావడంతో సంధ్యా రాణి తన అన్న, భర్త, తండ్రి, బావమరిదిలతో కలిసి ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేసినట్లు ఆసీఫ్ తెలిపారు.
Similar News
News October 12, 2025
జీఎస్టీ బెనిఫిట్ బజార్‌ను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

భీమవరంలో సూపర్ జీఎస్టీ బెనిఫిట్ బజార్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 13 నుంచి 19 వరకు భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ నందు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జీఎస్టీ తగ్గింపుల ప్రచారాన్ని 4 కేటగిరీలుగా విభజించి మూడు వారాలపాటు వివిధ వస్తువుల ప్రదర్శనలతో అవగాహన కలిగించే విధంగా ప్రచారాన్ని పూర్తి చేయడం జరిగిందన్నారు.
News October 12, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 12, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 12, ఆదివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.56 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.08 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.03 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.18 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.56 గంటలకు
✒ ఇష: రాత్రి 7.09 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.