News October 11, 2025
నిజామాబాద్ డీసీసీ కొత్త బాస్ ఎవరో?

పార్టీ సంస్థాగత నిర్మాణ పటిష్టత కోసం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుని ఎంపిక ప్రక్రియ మొదలైంది. ఆశవాహుల నుంచి ఈ నెల 12 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. జిల్లా పరిశీలకుడిగా కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యే రిజ్వన్ను నియమించారు. అయితే ఏడేళ్లుగా మానాల మోహన్ రెడ్డి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. 15 రోజుల్లో జిల్లాకు కొత్త అధ్యక్షున్ని నియమించే అవకాశం ఉంది.
Similar News
News October 11, 2025
నిజామాబాద్: చిట్టితల్లి హృదయం చిన్నబొతోంది..!

చదువుకోవలసిన వయసులో బాలికలకు వివాహాలు చేస్తున్నారు. ఆడుకోవాల్సిన వయసులో చిట్టి తల్లులు, మరో చిట్టి తల్లిని లాలించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అభం శుభం తెలియని చిన్నారులను తల్లిదండ్రులు బలి పశువులను చేస్తున్నారు. పెళ్లి అనే బంధం తెలియకుండానే వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో పది నెలల వ్యవధిలో 22 బాల్య వివాహాలను అడ్డుకున్నట్లు ఐసీడీఎస్ అధికారులు తెలిపారు.
News October 11, 2025
SRSP: వరద గేట్ల మూసివేత

ఎగువ నుంచి వరద ఇన్ ఫ్లో తగ్గడంతో అధికారులు శ్రీరాం సాగర్ ప్రాజెక్టు వరద గేట్లను శనివారం తెల్లవారుజామున మూసివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు శనివారం ఉదయం 8 గంటలకు 10 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా దిగువకు 9,790 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టులో 80.053 TMCల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
News October 11, 2025
జాగృతి అంటేనే పోరాటాల జెండా…విప్లవాల జెండా: కవిత

జాగృతి అంటేనే పోరాటాల జెండా, విప్లవాల జెండా అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో ప్రముఖ బీసీ నాయకుడు రామ్‌కోటి సహా సుమారు 350 మంది జాగృతిలో చేరారు. కవిత మాట్లాడుతూ.. జాగృతిలో చేరడం అంటే బతుకమ్మ ఆడినట్లు అందంగా కూడా ఉంటుందని, అదే విధంగా పోరాటం చేయాల్సి కూడా ఉంటుందని అన్నారు.