News October 11, 2025
HYD: నేరగాళ్ల చేతిలో చదువుకున్నోళ్లే మోసపోతున్నారు!

సైబర్ మోసాల్లో చదువుకున్నవారే అత్యధికంగా మోసపోతున్న పరిస్థితి ఉందని NCRB తెలిపింది. సైబర్ మోసాల్లో 60 శాతం మంది ఐటీ ఉద్యోగులు, నిపుణులు బాధితులుగా ఉంటున్నారు. మరోవైపు 30 శాతం మంది ప్రైవేట్ ఉద్యోగులు, 10% మంది ఇతరులు ఉన్నట్లుగా గుణాంకాలు చెబుతున్నాయి. NCRB గుణాంకాల ప్రకారం HYD లాంటి నగరాల్లో ఈ పరిస్థితి ఉందని తెలిపింది.
Similar News
News October 12, 2025
రాహుల్ మాదిరే తేజస్వీ ఓడిపోతారు: PK

అమేఠిలో గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓడినట్లే RJD నేత తేజస్వీ యాదవ్ రాఘోపుర్‌లో పరాజయం చెందుతారని జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ జోస్యం చెప్పారు. ఆ నియోజకవర్గంలో కుటుంబ ఆధిపత్యాన్ని ఓటర్లు ఒప్పుకోవట్లేదని విమర్శించారు. తేజస్వీ కుటుంబం ఇక్కడి నుంచి ఎన్నికవుతున్నా కనీస సౌకర్యాలు కరవయ్యాయని ఆరోపించారు. అటు ఎన్నికల్లో తన పోటీపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని వివరించారు.
News October 12, 2025
సచివాలయం: వీధి కుక్కలను పట్టుకున్న అధికారులు

తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో వీధి కుక్కలు హల్చల్ చేస్తున్నాయి. ఈ ఘటనపై అధికారులు స్పందించారు. సచివాలయం ప్రాంగణంలోని మీడియా పాయింట్, క్యాంటీన్, విజిటర్స్ లాంగ్‌లో తిరుగుతున్న కుక్కలను అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు, సందర్శకులు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
News October 12, 2025
VKB: బాలికలు.. క్రీడల్లో మహారాణులు

వికారాబాద్ జిల్లా పుట్టపాడు హై స్కూల్‌కి చెందిన బాలికలు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తున్నారు. ఈ పాఠశాలకు చెందిన బాలికలు కబడ్డీ అండర్-14 బాలికల విభాగంలో పరిగి జోన్‌లో విజేతగా నిలిచారు. వసుధా రెడ్డి, మదిహా ఫాతిమా, అక్షిత జిల్లాస్థాయిలో రాణించి, ప్రతిభ చాటారు. PD ప్రణవి ప్రోత్సాహంతో విద్యార్థులు అన్ని క్రీడల్లో రాణిస్తున్నారు. నేడు అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా.. Way2News ప్రత్యేక కథనం.