News October 11, 2025

AIతో ‘కరెంట్ షాక్’!

image

భారత్ సహా ప్రపంచ దేశాలు AI వెంట పరిగెడుతున్నాయి. టెక్నాలజీ అవసరమైనా దాని వల్ల ఎలక్ట్రిసిటీ రూపంలో ఓ పెద్ద సమస్య ఉత్పన్నం కానుందనే చర్చ మొదలైంది. AI డేటా సెంటర్ల నిర్వహణకు పెద్ద మొత్తంలో విద్యుత్ అవసరం అవుతుంది. ఫలితంగా కరెంట్‌కు డిమాండ్ పెరిగి విద్యుత్ ఛార్జీలతో పాటు పవర్ కట్‌లు పెరుగుతాయని జోహో ఫౌండర్ శ్రీధర్ పేర్కొన్నారు. 2023 నుంచి ఏథెన్స్, జార్జియాలో 60% ఛార్జీలు పెరిగిన విషయాన్ని ఉదహరించారు.

Similar News

News October 12, 2025

‘PM మీరు చాలా గ్రేట్’.. మోదీకి ట్రంప్ మెసేజ్

image

అమెరికా రాయబారి సెర్గియో గోర్ PM మోదీని కలిశారు. ఆ సమయంలో మోదీ, US అధ్యక్షుడు ట్రంప్ కలిసున్న ఫొటోను బహూకరించారు. దానిపై ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ మీరు చాలా గ్రేట్’ అని రాసిన ఒక స్పెషల్ నోట్ ఉంది. అలాగే సెర్గియో కూడా భేటీ అనంతరం ట్రంప్‌కు PM మోదీ ‘గ్రేట్ పర్సనల్ ఫ్రెండ్’ అని పేర్కొన్నారు. ఆయన విదేశాంగ మంత్రి జైశంకర్, విదేశీ కార్యదర్శి మిస్రీ, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్‌నూ కలిశారు.

News October 12, 2025

అక్టోబర్ 12: చరిత్రలో ఈ రోజు

image

1911: భారత మాజీ క్రికెటర్ విజయ్ మర్చంట్ జననం
1918: తెలుగు సినీ నిర్మాత రామకృష్ణారావు జననం
1946: భారత మాజీ క్రికెటర్ అశోక్ మన్కడ్ జననం
1967: సోషలిస్ట్ నాయకుడు రామ్‌మనోహర్ లోహియా మరణం
1981: నటి స్నేహ(ఫొటోలో)జననం
1983: మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ జననం
1991: హీరోయిన్ అక్షర హాసన్(ఫొటోలో) జననం

News October 12, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.