News October 11, 2025

వీఎంఆర్డీఏ కమిషనర్ బదిలీపై చర్చ!

image

VMRDA 2047 మాస్టర్ ప్లాన్‌‌‌తో విశాఖ నగర విస్తృత అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుతోంది. ఈ తరుణంలో రెవెన్యూ అంశాలపై మంచి పట్టున్న VMRDA కమిషనర్ విశ్వనాథన్ బదిలీపై చర్చ నడుస్తోంది. అధికార వర్గాల నుంచి వస్తున్న వినతులు, అభ్యంతరాలను కమిషనర్‌ సీరియస్‌గా తీసుకోకపోవడం, ముక్కుసూటితనంగా ఉండటంతో ఆయనను బదిలీ చేయించారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా అమరావతిలో I&PR డైరెక్టర్‌గా ఆయన బదిలీ అయ్యారు.

Similar News

News October 12, 2025

భాగస్వామ్య సదస్సుకు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దండి: మేయర్

image

విశాఖ వేదికగా జరుగనున్న భాగస్వామ్య సదస్సుకు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని మేయర్ పీలా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. శనివారం తాటిచెట్లపాలెం, న్యూకాలనీ రోడ్డు, తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. పలు సెంటర్లలో కొత్త మొక్కలను ఏర్పాటు చేయాలని సూచించారు. అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలను చేపట్టాలని మేయర్ ఆదేశించారు.

News October 12, 2025

విశాఖలో టుడే టాప్ న్యూస్

image

➤ దువ్వాడ దొంగతనం కేసును చేధించిన పోలీసులు
➤ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, మేయర్
➤ కోటి సంతకాల ‘ప్రజా ఉద్యమం’ పోస్టర్ ఆవిష్కరించిన కె.కె.రాజు
➤ రేపు విశాఖ రానున్న మంత్రి నారా లోకేశ్
➤ పీఎంపాలెంలో వివాహిత సూసైడ్
➤ కేజీహెచ్ నుంచి ఆరుగురు విద్యార్థులు డిశ్చార్జ్
➤ యాంటీ డ్రగ్ గ్లో థిమ్ పార్క్ ప్రారంభం
➤ విశాఖలో విజయవాడ రౌడీ షీటర్ హత్య

News October 12, 2025

విశాఖ: రౌడీ షీటర్‌ను చంపిన కేసులో నలుగురి అరెస్ట్

image

విజయవాడ రౌడీ షీటర్ శ్రీధర్‌ను చంపేసిన కేసులో‌ నలుగురిని అరెస్ట్ చేశామని ఏసీపీ నరసింహమూర్తి తెలిపారు. రౌడీ షీటర్ శ్రీధర్ ఎలమంచిలి కోర్టుకు రాగా ఇక్కడ ఉంటున్న రౌడీ షీటర్ గౌరీశంకర్‌తో కలిసి విశాఖ వచ్చాడు. వీరితో పాటు మరో ఇద్దరు మద్యం తాగి శ్యామల అనే మహిళ ఇంటిలో గొడవపడ్డారు. ఈ గొడవలో శ్రీధర్‌ను గౌరీ శంకర్ కత్తితో పొడిచి పోలవరం కాలువలో పడేశాడు. దర్యాప్తులో నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.