News October 11, 2025
అనంత: గుండెపోటుతో ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి

అనంతపురంలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సతీశ్ కుమార్ గుండెపోటుకు గురై మృతి చెందారు. తెల్లవారుజామున శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉందంటూ కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Similar News
News October 12, 2025
ఈనెల 13న కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో ఈనెల 13న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శనివారం కలెక్టర్ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News October 11, 2025
అనంతపురంలో కిలో టమాటా రూ.19

అనంతపురం శివారులోని కక్కలపల్లి మార్కెట్ యార్డ్‌లో టమాటా ధరలు తగ్గుముఖం పట్టాయి. గరిష్ఠంగా కిలో రూ.19, కనిష్ఠ ధర రూ.10, సరాసరి ధర రూ.14తో అమ్ముడుపోతున్నట్లు రాప్తాడు మార్కెట్ యార్డ్ కార్యదర్శి రూప్ కుమార్ తెలిపారు. మార్కెట్‌కు 1,650 టన్నుల టమాటా వచ్చినట్లు ఆయన తెలిపారు. మరోవైపు ధరలు తగ్గుముఖం పట్టడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News October 11, 2025
రాష్ట్రస్థాయి పోటీలకు తాడిపత్రి విద్యార్థిని ఎంపిక

రాష్ట్ర స్థాయి స్పీడ్ స్కేటింగ్ పోటీలకు తాడిపత్రికి చెందిన 7వ తరగతి విద్యార్థిని అస్రున్ ఎంపికైనట్లు కోచ్ మధు తెలిపారు. అనంతపురంలో నిర్వహించిన జిల్లాస్థాయి SGFI స్పీడ్ స్కేటింగ్ పోటీల్లో అండర్ -14 విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిందన్నారు. ఎంపికైన విద్యార్థిని అస్రున్‌ను పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించింది.