News October 11, 2025
మహిళా రైతు నాగేంద్రమ్మను సత్కరించిన కలెక్టర్, ఎమ్మెల్యేలు

ప్రకృతి వ్యవసాయ సాగులో ఆదర్శంగా నిలిచిన మహిళా రైతు నెట్టెం నాగేంద్రమ్మను జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, వ్యవసాయ అధికారులు, ముఖ్య అధికారులు కలిసి సత్కరించారు. శనివారం జిల్లా కలెక్టరేట్లో జరిగిన ధన, ధాన్య యోగం కార్యక్రమం ప్రారంభం అనంతరం ఆమెను సత్కరించారు. ప్రతి ఒక్కరు ముగ్గు చూపే విధంగా క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
Similar News
News October 12, 2025
విదేశీ పర్యటనలకు ప్రభుత్వ టీచర్లు

TG: ప్రభుత్వ టీచర్లు, హెడ్ మాస్టర్స్, ప్రిన్సిపల్స్ కోసం ప్రభుత్వం అంతర్జాతీయ ఎక్స్‌పోజర్ సందర్శనలు, విద్యా మార్పిడి కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ ఏడాది OCT, NOVలో టీచర్స్ సింగపూర్, ఫిన్లాండ్, వియత్నాం, జపాన్‌ను సందర్శిస్తారు. జిల్లా నుంచి ముగ్గురు చొప్పున విదేశీ పర్యటనకు కలెక్టర్లు ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేస్తారు. సుమారు 160మంది టీచర్స్‌ను 4 బ్యాచులుగా విదేశాలకు పంపుతారు.
News October 12, 2025
ఈనెల 14న బంద్: దుడుకు లక్ష్మీనారాయణ

బీసీల రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ ఈనెల 14న బంద్ పాటించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ అన్నారు. నల్గొండలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ బంద్‌లో బడుగు బలహీన వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుండు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
News October 12, 2025
NGKL: మద్యం దుకాణాలకు 85 దరఖాస్తులు

నాగర్ కర్నూల్ జిల్లాలో మద్యం దుకాణాలకు శనివారం సాయంత్రం నాటికి మొత్తం 85 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రకటించారు. మొత్తం 67 మద్యం దుకాణాలకు గాను నాగర్ కర్నూల్ పరిధి నుంచి 39, తెలకపల్లి పరిధి నుంచి 6, కొల్లాపూర్ పరిధి నుంచి 7, కల్వకుర్తి పరిధి నుంచి 32, అచ్చంపేట పరిధి నుంచి ఒక్క దరఖాస్తు వచ్చినట్లు తెలిపారు. ఈనెల 18 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు.