News October 11, 2025
MBNR: విషాదం.. చేపల వేటకు వెళ్లి అన్నదమ్ములు మృతి

మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని బలీదుపల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. స్థానిక చెక్ డ్యాం వద్ద చేపల వేటకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన సుధాకర్, సాయిలు అనే అన్నదమ్ములు నీటిలో ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందారు. ఇటీవలే తల్లి సంవత్సరీకానికి హైదరాబాద్ నుంచి గ్రామానికి వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News October 12, 2025
సంగారెడ్డి: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ మేళా

కంది మండలం ఎద్దుమైలారం పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 2025-26కు సంబంధించి అర్హులైన ఐటీఐ అభ్యర్థులకు వివిధ ట్రెడ్‌లలో 304 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 17న జిల్లా కేంద్రంలోని ఐటీఐ సెంటర్‌లో నిర్వహించే జాబ్ మేళాకు జిల్లా పరిసర ప్రాంతాల విద్యార్థులు తమ సర్టిఫికేట్స్‌తో హజరై ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కంపెనీ డైరెక్టర్ అలోక్ ప్రసాద్ తెలిపారు.
News October 12, 2025
ఫేక్ ఫొటోలపై పవన్ హీరోయిన్ ఫైర్

తన ఫేక్ ఫొటోలు వైరల్ చేయడంపై OG మూవీ హీరోయిన్ ప్రియాంక మోహన్ ఫైర్ అయ్యారు. ‘నన్ను తప్పుగా చిత్రీకరించిన కొన్ని AI జెనరేటెడ్ ఫొటోలు వైరలవుతున్నాయి. దయచేసి అలాంటివి షేర్ చేయడం, స్ప్రెడ్ చేయడం ఆపేయండి. టెక్నాలజీని కేవలం ఎథికల్ క్రియేటివిటీకి మాత్రమే వినియోగించాలి. ఏం క్రియేట్ చేస్తున్నాం? ఎలాంటివి షేర్ చేస్తున్నాం అనే విషయంలో మాత్రం అందరూ కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి’ అని ట్వీట్ చేశారు.
News October 12, 2025
విదేశీ పర్యటనలకు ప్రభుత్వ టీచర్లు

TG: ప్రభుత్వ టీచర్లు, హెడ్ మాస్టర్స్, ప్రిన్సిపల్స్ కోసం ప్రభుత్వం అంతర్జాతీయ ఎక్స్‌పోజర్ సందర్శనలు, విద్యా మార్పిడి కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ ఏడాది OCT, NOVలో టీచర్స్ సింగపూర్, ఫిన్లాండ్, వియత్నాం, జపాన్‌ను సందర్శిస్తారు. జిల్లా నుంచి ముగ్గురు చొప్పున విదేశీ పర్యటనకు కలెక్టర్లు ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేస్తారు. సుమారు 160మంది టీచర్స్‌ను 4 బ్యాచులుగా విదేశాలకు పంపుతారు.