News October 11, 2025
HNK: ఇంజినీరింగ్ విద్యార్థి బలవన్మరణం..!

హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి(M) గోపాలపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కీర్తన ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఎస్సై ప్రవీణ్ వివరాల ప్రకారం.. ఈనెల 10న ఎవరూ లేని సమయంలో కీర్తన ఉరి వేసుకొని బలవర్మరణానికి పాల్పడింది. తండ్రి కృష్ణకర్ ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, కీర్తన జేఎన్టీయూలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది.
Similar News
News October 12, 2025
ప్రొద్దుటూరు: రాష్ట్రస్థాయి స్కేటింగ్ పోటీలకు ఎంపికైన దియా సింహ

ప్రొద్దుటూరుకు చెందిన సింహా సేన్ రెడ్డి కుమార్తె దియా సింహ రాష్ట్రస్థాయి స్కేటింగ్ పోటీలకు ఎంపికైంది. కడపలో శనివారం జరిగిన జిల్లా స్థాయి స్కేటింగ్ పోటీలలో విద్యార్థిని దియా సింహ బ్రాంజ్ మెడల్ సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. త్వరలో విశాఖపట్నంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలలో దియాసింహ పాల్గొనున్నట్లు కోచ్ నాగేశ్వరరావు తెలియజేశారు.
News October 12, 2025
సంగారెడ్డి: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ మేళా

కంది మండలం ఎద్దుమైలారం పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 2025-26కు సంబంధించి అర్హులైన ఐటీఐ అభ్యర్థులకు వివిధ ట్రెడ్‌లలో 304 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 17న జిల్లా కేంద్రంలోని ఐటీఐ సెంటర్‌లో నిర్వహించే జాబ్ మేళాకు జిల్లా పరిసర ప్రాంతాల విద్యార్థులు తమ సర్టిఫికేట్స్‌తో హజరై ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కంపెనీ డైరెక్టర్ అలోక్ ప్రసాద్ తెలిపారు.
News October 12, 2025
ఫేక్ ఫొటోలపై పవన్ హీరోయిన్ ఫైర్

తన ఫేక్ ఫొటోలు వైరల్ చేయడంపై OG మూవీ హీరోయిన్ ప్రియాంక మోహన్ ఫైర్ అయ్యారు. ‘నన్ను తప్పుగా చిత్రీకరించిన కొన్ని AI జెనరేటెడ్ ఫొటోలు వైరలవుతున్నాయి. దయచేసి అలాంటివి షేర్ చేయడం, స్ప్రెడ్ చేయడం ఆపేయండి. టెక్నాలజీని కేవలం ఎథికల్ క్రియేటివిటీకి మాత్రమే వినియోగించాలి. ఏం క్రియేట్ చేస్తున్నాం? ఎలాంటివి షేర్ చేస్తున్నాం అనే విషయంలో మాత్రం అందరూ కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి’ అని ట్వీట్ చేశారు.