News October 11, 2025
ఒంగోలు నుంచి పాకల బీచ్‌కు ఫ్రీ బస్సు

ఒంగోలు డిపో నుంచి ప్రతి ఆదివారం పాకల బీచ్‌కి స్త్రీ శక్తి పథకం వర్తించే బస్సులు ప్రత్యేకంగా నడపనున్నట్లు ఒంగోలు RTC డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు, యాత్రికులు ఈ సర్వీస్‌ని ఉపయోగించుకోవాల్సిందిగా ఆయన శనివారం ప్రకటన విడుదల చేశారు. ప్రతి ఆదివారం పాకల బీచ్‌కు వచ్చే సందర్శకులకు ఇదొక మంచి సదవకాశంగా చెప్పవచ్చు.
Similar News
News October 12, 2025
CPR చేసి ప్రాణం కాపాడిన కనిగిరి CI

కనిగిరి కాస్మోపాలేట్ క్లబ్‌లో శనివారం టెన్నిస్ ఆడుతున్న కనిగిరి PACS అధ్యక్షుడు అద్దంకి రంగబాబు ఉన్నపలంగా కింద పడిపోయారు. పక్కనే ఉన్న కనిగిరి సీఐ ఖాజావళి గమనించి CPR చేశారు. వెంటనే వైద్యశాలకు తగలించగా సీపీఆర్ వల్ల ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు తెలిపారు. దీంతో సీఐ చేసిన పనిని పలువురు మెచ్చుకున్నారు. సీఐ మాట్లాడుతూ..CPRపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని అన్నారు.
News October 11, 2025
ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద పోలీసుల తనిఖీలు

ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద శనివారం పోలీస్ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు.. శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా పోలీస్ డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి అణువణువు తనిఖీ నిర్వహించాయి. అలాగే సమీప లాడ్జీలను సైతం తనిఖీ చేసి అనుమానిత వ్యక్తుల వివరాలు ఆరా తీశారు. కాగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు గత కొద్దిరోజులుగా తనిఖీ చేస్తున్న విషయం తెలిసిందే.
News October 11, 2025
హత్య కేసులో ముద్దాయికి యావజ్జీవ శిక్ష

కొండపి వైన్ షాప్ దగ్గర వాచ్మెన్‌గా పనిచేస్తున్న ముక్కోటిపాలెం గ్రామంకు చెందిన సుబ్బారెడ్డి అనే యువకుడ్ని 2023 ఏప్రిల్ నెలలో హత్య చేశారు. కాగా సీఐ సోమశేఖర్ ఆధ్వర్యంలో కేసు ట్రైల్స్‌ని సమర్థవంతంగా నిర్వహించారు. శుక్రవారం ముద్దాయి హనుమంతరావుకి కోర్టులో యావజీవ శిక్ష ఖరారు చేసినట్లు సీఐ సోమశేఖర్ తెలిపారు. ఈ కేసులో సమర్థవంతంగా వ్యవహరించిన సీఐ సోమశేఖర్, ఎస్సై ప్రేమ్కుమార్‌ను అధికారులు అభినందిచారు.