News October 11, 2025
అంతర్వేదిలో నటుడు సునీల్ సందడి

సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ప్రముఖ సినీ నటుడు సునీల్ శనివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికి, స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయనకు వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు, అర్చకులు స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను సునీల్‌కు అందజేశారు.
Similar News
News October 12, 2025
స్కూల్స్‌లో UPIతో ఫీజుల చెల్లింపు!

దేశంలో UPI పేమెంట్స్‌కు ప్రాధాన్యత పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే స్కూల్స్‌లో ఫీజుల వసూలు ప్రక్రియను అప్‌గ్రేడ్ చేయాలని కేంద్రం కోరింది. అడ్మిషన్, ఎగ్జామ్ ఫీజు, స్కూళ్లకు సంబంధించిన లావాదేవీలకు UPI, మొబైల్ పేమెంట్స్ వంటి ఆధునిక విధానాలను వినియోగించాలని విద్యాశాఖ రాష్ట్రాలు, సంబంధిత విభాగాలకు లేఖలు రాసింది. CBSE, కేంద్రీయ విద్యాలయ, నవోదయ వంటి విద్యాసంస్థలు ఈ లిస్ట్‌లో ఉన్నాయి.
News October 12, 2025
కామారెడ్డి డీసీసీ: ఛైర్ కోసం ఢీ అంటే ఢీ!

కామారెడ్డి జిల్లా DCC అధ్యక్ష పదవి ఎన్నికపై నేతల్లో ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఈ నెల 13వ తేదీన AICC, PCC పరిశీలకుల బృందం జిల్లాకు రానుంది. ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న కైలాస్ శ్రీనివాస్ మరో ఉన్నత పదవిని ఆశిస్తున్నారు. ముఖ్యంగా నిజాంసాగర్ మండల వాసి మల్లికార్జున్, బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, గీ రేడ్డి మహేందర్ రెడ్డి, రాజు ఈ పదవిని దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
News October 12, 2025
KMR: అధ్యయనానికి దరఖాస్తులు ఆహ్వానం!

విదేశీ విద్యా విధానం అధ్యయనం కోసం ప్రభుత్వ, స్థానిక సంస్థలు, మోడల్ స్కూల్, TGRIES పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు DEO రాజు తెలిపారు. కనీసం 10 సంవత్సరాల బోధనానుభవం కలిగి, 55 సంవత్సరాల లోపు ఉన్న, చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ ఉన్నవారు అర్హులన్నారు. అర్హత గల వారు దరఖాస్తులను ఈ నెల 14వ తేదీ సా. 4 గంటలలోపు DEO కార్యాలయంలో అందజేయాలన్నారు.