News October 11, 2025

చంద్రబాబుకు ప్రధాని మోదీ అభినందనలు

image

సీఎంగా 15 ఏళ్ల మార్కును అధిగమించిన చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఆయన విజన్, సుపరిపాలన పట్ల ఉన్న నిబద్ధత రాజకీయ జీవితంలో స్థిరంగా కొనసాగేలా చేస్తున్నాయని కొనియాడారు. తాను సీఎంగా ఉన్న సమయంలోనూ చంద్రబాబుతో కలిసి పనిచేసినట్లు చెప్పారు. ఏపీ సంక్షేమం కోసం ఉత్సాహంతో పనిచేస్తున్న ఆయనకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు.

Similar News

News October 12, 2025

‘గాజా పీస్ డీల్’కు హమాస్ ససేమిరా!

image

ఈజిప్ట్‌లో జరగనున్న ‘గాజా పీస్ డీల్‌’ కార్యక్రమానికి హమాస్ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. US అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందంలో హమాస్‌కు అభ్యంతరాలున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ‘పాలస్తీనియన్లు హమాస్ సభ్యులు అయినా, కాకపోయినా వారిని వారి దేశం నుంచి బహిష్కరించడం గురించి మాట్లాడటం అర్థంలేనిది. ఆయుధాల అప్పగింతకు అసలు తావులేదు’ అని హమాస్ లీడర్లు చెప్పినట్లు వార్తలొచ్చాయి.

News October 12, 2025

Women’s WC: నేడు ఆసీస్‌తో హర్మన్‌ సేన ఢీ

image

మహిళల వన్డే WCలో భాగంగా విశాఖ వేదికగా ఇవాళ మ.3 గం.కు INDW-AUSW జట్లు తలపడపనున్నాయి. ఈ మ్యాచ్‌కు అన్ని టికెట్లు బుక్ అవ్వడం విశేషం. భారత్ తొలి 2మ్యాచులు గెలిచి SAతో ఓడిపోయింది. అటు ఆసీస్ టీమ్ మంచి ఫామ్‌లో ఉంది. 2 విజయాలతోపాటు వర్షం కారణంగా SLతో మ్యాచ్ రద్దవడంతో పాయింట్లు పంచుకుంది. స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్‌ ఉన్న AUSపై గెలవాలంటే కచ్చితంగా IND టాపార్డర్ సత్తా చాటాల్సిందే.

News October 12, 2025

స్కూల్స్‌లో UPIతో ఫీజుల చెల్లింపు!

image

దేశంలో UPI పేమెంట్స్‌కు ప్రాధాన్యత పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే స్కూల్స్‌లో ఫీజుల వసూలు ప్రక్రియను అప్‌గ్రేడ్ చేయాలని కేంద్రం కోరింది. అడ్మిషన్, ఎగ్జామ్ ఫీజు, స్కూళ్లకు సంబంధించిన లావాదేవీలకు UPI, మొబైల్ పేమెంట్స్ వంటి ఆధునిక విధానాలను వినియోగించాలని విద్యాశాఖ రాష్ట్రాలు, సంబంధిత విభాగాలకు లేఖలు రాసింది. CBSE, కేంద్రీయ విద్యాలయ, నవోదయ వంటి విద్యాసంస్థలు ఈ లిస్ట్‌లో ఉన్నాయి.