News October 11, 2025

నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు యాప్: CBN

image

AP: నకిలీ మద్యం గుర్తించడానికి త్వరలో యాప్ తీసుకొస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ఎక్సైజ్‌శాఖపై సమీక్ష నిర్వహించారు. యాప్ ద్వారా మద్యం బాటిల్‌పై హోలోగ్రామ్ స్కాన్ చేస్తే మద్యం అసలైందో నకిలీదో తెలుస్తుందన్నారు. గత ప్రభుత్వం నకిలీ మద్యాన్ని ప్రోత్సహించి, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిందని ఫైరయ్యారు. నకిలీ మద్యం వ్యవహారంలో TDP నేతలను సస్పెండ్ చేశామని తెలిపారు.

Similar News

News October 12, 2025

ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు

image

ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ APలోని అల్లూరి, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని APSDMA హెచ్చరించింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్సుందని పేర్కొంది. అటు TGలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.

News October 12, 2025

దేవుడు ఎవరికి కనిపిస్తాడంటే?

image

బ్రాహ్మణులకు, యజ్ఞాలు చేసేవారికి అగ్నియే దేవుడు. ధ్యానం చేసే మునులకు హృదయమే దేవుడు. అల్పబుద్ధి గల సామాన్యులు విగ్రహాలను దైవంగా భావిస్తారు. అయితే సమదృష్టి గల మహాత్ములు మాత్రం అన్ని చోట్లా దేవుణ్ని చూడగలుగుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. సర్వం దైవ స్వరూపమే అని గ్రహించిన వారికి సకలమూ దైవమయంగా, ఆనందమయంగా కనిపిస్తుంది. వారికి నిజమైన జ్ఞానం సిద్ధిస్తుంది. <<-se>>#WhoIsGod<<>>

News October 12, 2025

‘గాజా పీస్ డీల్’కు హమాస్ ససేమిరా!

image

ఈజిప్ట్‌లో జరగనున్న ‘గాజా పీస్ డీల్‌’ కార్యక్రమానికి హమాస్ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. US అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందంలో హమాస్‌కు అభ్యంతరాలున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ‘పాలస్తీనియన్లు హమాస్ సభ్యులు అయినా, కాకపోయినా వారిని వారి దేశం నుంచి బహిష్కరించడం గురించి మాట్లాడటం అర్థంలేనిది. ఆయుధాల అప్పగింతకు అసలు తావులేదు’ అని హమాస్ లీడర్లు చెప్పినట్లు వార్తలొచ్చాయి.