News October 12, 2025

పీపీపీ విధానంలో 110 మెడికల్ సీట్లు అదనం : సీఎం

image

కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్ ప్రారంభించిన తర్వాత మాట్లాడారు. దీని వల్ల పేద విద్యార్థులకు అదనంగా 110 మెడికల్ సీట్లు వస్తాయని తెలిపారు. గత ప్రభుత్వం అనుసరించిన విధానంలో ఆసుపత్రులు కడితే మరో 20 ఏళ్లు సమయం పడుతుందని, అప్పటివరకు పేదలు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు.

Similar News

News October 12, 2025

జిల్లా యువజన వారోత్సవాలకు ఆహ్వానం: సెట్నల్

image

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈనెల 23వ తేదీన DKW కళాశాలలో జరగనున్న జిల్లా స్థాయి యువజన వారోత్సవాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సెట్నల్ సీఈవో నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. 15 ఏళ్ల నుంచి 29 ఏళ్ల లోపు వారికి ఫోక్ డ్యాన్స్, గ్రూప్ ఫోక్ సాంగ్, స్టోరీ రైటింగ్, పెయింటింగ్, పొయెట్రీ రైటింగ్ పలు విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఆసక్తిగల వారు ఈనెల 18లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆహ్వానించారు.

News October 12, 2025

నిబంధనలు అతిక్రమించి బాణసంచా తయారీ చేస్తే చర్యలు : SP

image

నెల్లూరు జిల్లాలో బాణసంచా తయారీ, విక్రయాలు చేసేవారు తప్పనిసరిగా లైసెన్సు కలిగి ఉండాలని నెల్లూరు జిల్లా SP అజిత తెలిపారు. టపాసుల గోడౌన్‌లో ఆకస్మిక తనిఖీలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. టపాసులు అక్రమ నిల్వలు ఉన్నాయనే కారణాలతో ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులు, విడవలూరు పరిధిలో-1 కేసు, కందుకూరు టౌన్ స్టేషన్ పరిధిలో-1 కేసు నమోదు చేసినట్లు ఆమె వివరించారు.

News October 12, 2025

కలువాయి: వృద్ధ దంపతుల ఆత్మహత్య

image

కలువాయి మండలం తోపుగుంట అగ్రహారానికి చెందిన వృద్ధ దంపతులు వింజం కొండయ్య, వింజం రత్నమ్మ ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామానికి సమీపంలోని పొలాల్లో విష గుళికలు తిని మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్సై కోటయ్య ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది