News October 12, 2025
CP సజ్జనార్‌తో మెగాస్టార్ చిరంజీవి

నగరానికి నూతన CPగా ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్‌ను ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. బంజారాహిల్స్‌లోని పోలీస్ కమిషనరేట్‌లో CPతో భేటీ అయ్యారు. ఇరువురి మీటింగ్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Similar News
News October 12, 2025
దేవుడు ఎవరికి కనిపిస్తాడంటే?

బ్రాహ్మణులకు, యజ్ఞాలు చేసేవారికి అగ్నియే దేవుడు. ధ్యానం చేసే మునులకు హృదయమే దేవుడు. అల్పబుద్ధి గల సామాన్యులు విగ్రహాలను దైవంగా భావిస్తారు. అయితే సమదృష్టి గల మహాత్ములు మాత్రం అన్ని చోట్లా దేవుణ్ని చూడగలుగుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. సర్వం దైవ స్వరూపమే అని గ్రహించిన వారికి సకలమూ దైవమయంగా, ఆనందమయంగా కనిపిస్తుంది. వారికి నిజమైన జ్ఞానం సిద్ధిస్తుంది. <<-se>>#WhoIsGod<<>>
News October 12, 2025
‘గాజా పీస్ డీల్’కు హమాస్ ససేమిరా!

ఈజిప్ట్‌లో జరగనున్న ‘గాజా పీస్ డీల్’ కార్యక్రమానికి హమాస్ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. US అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందంలో హమాస్‌కు అభ్యంతరాలున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ‘పాలస్తీనియన్లు హమాస్ సభ్యులు అయినా, కాకపోయినా వారిని వారి దేశం నుంచి బహిష్కరించడం గురించి మాట్లాడటం అర్థంలేనిది. ఆయుధాల అప్పగింతకు అసలు తావులేదు’ అని హమాస్ లీడర్లు చెప్పినట్లు వార్తలొచ్చాయి.
News October 12, 2025
బిట్‌కాయిన్, క్రిప్టో మోసాలపై జాగ్రత్త: ఎస్పీ

బిట్‌కాయిన్, క్రిప్టో మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. బిట్‌కాయిన్ పెట్టుబడుల పేరుతో మోసాలు జరుగుతున్నాయన్నారు. మీకు లింకులు పంపితే, వాటిని తెరవవద్దు అన్నారు. సైబర్ మోసం జరిగినట్లయితే వెంటనే 1930 (సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్) లేదా www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని సూచించారు.