News October 12, 2025

VKB: Way2News వరుస కథనాలు.. అధికారుల స్పందన

image

వికారాబాద్ పట్టణంలో కుక్కల దాడుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఏసుదాస్ తెలిపారు. శనివారం మున్సిపల్ అధికారులు వీధి కుక్కలను పట్టి జంతు నియంత్రణ కేంద్రానికి తరలించారు. కుక్కల సంఖ్య తగ్గించేలా వాటికి స్టెరిలైజేషన్ ఆపరేషన్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీధి కుక్కల స్వైర విహారం‌పై Way2News‌లో వరుస కథనాలు పబ్లీష్ అయ్యాయి.

Similar News

News October 12, 2025

దేవుడు ఎవరికి కనిపిస్తాడంటే?

image

బ్రాహ్మణులకు, యజ్ఞాలు చేసేవారికి అగ్నియే దేవుడు. ధ్యానం చేసే మునులకు హృదయమే దేవుడు. అల్పబుద్ధి గల సామాన్యులు విగ్రహాలను దైవంగా భావిస్తారు. అయితే సమదృష్టి గల మహాత్ములు మాత్రం అన్ని చోట్లా దేవుణ్ని చూడగలుగుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. సర్వం దైవ స్వరూపమే అని గ్రహించిన వారికి సకలమూ దైవమయంగా, ఆనందమయంగా కనిపిస్తుంది. వారికి నిజమైన జ్ఞానం సిద్ధిస్తుంది. <<-se>>#WhoIsGod<<>>

News October 12, 2025

‘గాజా పీస్ డీల్’కు హమాస్ ససేమిరా!

image

ఈజిప్ట్‌లో జరగనున్న ‘గాజా పీస్ డీల్‌’ కార్యక్రమానికి హమాస్ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. US అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందంలో హమాస్‌కు అభ్యంతరాలున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ‘పాలస్తీనియన్లు హమాస్ సభ్యులు అయినా, కాకపోయినా వారిని వారి దేశం నుంచి బహిష్కరించడం గురించి మాట్లాడటం అర్థంలేనిది. ఆయుధాల అప్పగింతకు అసలు తావులేదు’ అని హమాస్ లీడర్లు చెప్పినట్లు వార్తలొచ్చాయి.

News October 12, 2025

బిట్‌కాయిన్, క్రిప్టో మోసాలపై జాగ్రత్త: ఎస్పీ

image

బిట్‌కాయిన్, క్రిప్టో మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. బిట్‌కాయిన్ పెట్టుబడుల పేరుతో మోసాలు జరుగుతున్నాయన్నారు. మీకు లింకులు పంపితే, వాటిని తెరవవద్దు అన్నారు. సైబర్ మోసం జరిగినట్లయితే వెంటనే 1930 (సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్) లేదా www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని సూచించారు.