News April 7, 2024

నంద్యాల: భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి

image

బండి ఆత్మకూరు మండలం ఈర్ణపాడులో భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకున్న ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ప్రొద్దుటూరుకు చెందిన సులోచనను ఈర్ణపాడుకు చెందిన శ్రీకాంత్ రెడ్డి 2017లో వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. గొడవల కారణంగా ఇరువురూ కోర్టు మెట్లు ఎక్కారు. కోర్టు విడాకులు మంజూరు చేయకుండానే రెండో పెళ్లి చేసుకున్నాడని పోలీసులకు సులోచన ఫిర్యాదు చేశారు.

Similar News

News July 9, 2025

కర్నూలు మాజీ ఎంపీకి గోల్డ్ మెడల్

image

కర్నూలు మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్‌కు గవర్నర్ అబ్దుల్ నజీర్ గోల్డ్ మెడల్ బుధవారం విజయవాడలో అందజేశారు. 17వ పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన సమయంలో జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీకి చేసిన సేవలకు గాను ఈ మెడల్ అందజేసి, సన్మానించారు. గవర్నర్‌తో పాటు రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులకు ఎంపీ ధన్యవాదాలు తెలిపారు.

News July 9, 2025

మద్దికేరలో ఆక్సిండెంట్.. ఒకరి మృతి

image

మద్దికేరలోని బురుజుల రోడ్డులో రెండు బైకులు ఢీకొని ఒకరు మృతి చెందారు. మృతుడిని కైరుప్పలకు చెందిన తిరుమల యాదవ్(24)గా పోలీసులు గుర్తించారు. గుంతకల్లు మండలం గుళ్లపాలెంలో భార్యను చూసి సొంతూరుకు వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్ కుమార్ నాయక్ తెలిపారు.

News July 9, 2025

నిషేధిత పదార్థాలను విక్రయిస్తే చర్యలు తప్పవు: ఎస్పీ

image

జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్ధల సమీపంలోని 100 గజాల దూరంలో సిగరెట్, పొగాకు సంబంధిత పదార్ధాలు అమ్మడం నిషేధించామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ క్యాంపస్ సేఫ్ జోన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. నిషేధిత వస్తువులను షాప్ నిర్వాహకులు అమ్మితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని యజమానులకు అవగాహన కల్పించారు.