News October 12, 2025
HYD: పోలియో.. మా పిల్లలకు రానివ్వం!

HYDలో నేడు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ మహమ్మారి బారీన ఎవరూ పడొద్దని గత 27 ఏళ్లుగా నిరంతరాయంగా రెండు చుక్కలు వేస్తున్నారు. 1998లో నగరంలో పొలియో కేసు నమోదు అయ్యింది. నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వ, వైద్య శాఖ అధికారులు గల్లీలను జల్లెడ పట్టి పోలియో డ్రాప్స్ వేయించారు. పేరెంట్స్ సంరక్షణతో సిటీ పిల్లలు ఆరోగ్యంగా ఎదిగారు. అయినా నిర్లక్ష్యం వద్దు.. నిండు జీవితానికి రెండు చుక్కలు వేద్దాం.
Similar News
News October 12, 2025
HYD: ఒక్క రోజు పిల్లల కోసం కేటాయించండి

పోలీయో.. బాడీలో ఏంజరుగుతుందో తెలిసేలోపే అంతా అయిపోతుంది. అంగవైఖల్యం పిల్లల జీవితాన్ని చిదిమేస్తుంది. 2 చుక్కలతో నిండు జీవితాన్ని మహమ్మారి నుంచి రక్షించండి. పనులు పక్కనబెట్టి నేడు ఉ.7గం.నుంచి పోలీయో డ్రాప్స్ వేయించండి. HYDలోని అంగన్వాడీలు,ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో వేస్తారు. రైల్వే, మెట్రో స్టేషన్‌తో సహా అధికారులు 2,586 బూతూలు ఏర్పాటుచేశారు. జిల్లాలో 5,17,238 మంది బాలలు ఉన్నారు.
News October 12, 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. రంగంలోకి బావ బామ్మర్ది

జూబ్లీహిల్స్ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న BRS గెలుపుపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ ఉపఎన్నికతోనే తిరిగి కారు గేరు మార్చాలని యోచిస్తూ రంగంలోకి KTR, హరీశ్‌రావు దిగారు. ఇప్పటికే KTR డివిజన్ల వారీగా మీటింగ్‌లు పెట్టగా తాజాగా హరీశ్‌రావు కూడా ఎంట్రీ ఇచ్చారు. రేపు BRS జూబ్లీహిల్స్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో బావ బామ్మర్ది పాల్గొననున్నారు. ఈనెల 15న BRS అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ వేయనున్నారు.
News October 12, 2025
CP సజ్జనార్‌తో మెగాస్టార్ చిరంజీవి

నగరానికి నూతన CPగా ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్‌ను ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. బంజారాహిల్స్‌లోని పోలీస్ కమిషనరేట్‌లో CPతో భేటీ అయ్యారు. ఇరువురి మీటింగ్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.