News April 7, 2024
MPC, BiPC విద్యార్థులకు BIG ALERT

TG: EAPCET-2024 దరఖాస్తుల్లో జరిగిన పొరపాట్లు సరిచేసుకునే అవకాశాన్ని JNTUH కల్పిస్తోంది. ఏప్రిల్ 8 నుంచి 12వ తేదీ వరకు విద్యార్థులు వెబ్‌సైటులో కరెక్షన్ చేసుకోవచ్చు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పేమెంట్ ఐడీ, మొబైల్, పుట్టిన తేదీతో లాగిన్ కావాలి. అన్ని వివరాలు ఎడిట్ చేశాక.. సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. అటు రూ.250 జరిమానాతో APR 9వ తేదీ వరకు, రూ.5000 ఫైన్‌తో మే 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Similar News
News December 29, 2025
VHT: థర్డ్ మ్యాచ్ ఆడనున్న కోహ్లీ

విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ తరఫున కోహ్లీ థర్డ్ మ్యాచ్ ఆడటం కన్ఫర్మ్ అయింది. బెంగళూరులో 2026 JAN 6న రైల్వేస్‌తో మ్యాచులో విరాట్ ఆడుతారని DDCA ప్రెసిడెంట్ రోహన్ జైట్లీ ప్రకటించారు. న్యూజిలాండ్ సిరీస్‌కు వడోదరలో ODI టీమ్ JAN 8లోపు ట్రైనింగ్ కోసం వెళ్లాల్సి ఉంది. ఈ తరుణంలో 6న బెంగళూరులో ఆడి 7న అక్కడ రిపోర్ట్ చేస్తారని సమాచారం.
News December 29, 2025
ఒక్క కాఫీతో కపుల్స్ గొడవలకు ఫుల్‌స్టాప్!

దంపతుల మధ్య చిన్న చిన్న గొడవలు సహజం. గిల్లికజ్జాలు లేకపోతే ఆ సంసారంలో మజా ఉండదు అంటారు. అయితే ఒక్కోసారి మాటామాటా పెరిగి ఈగోకి పోతుంటారు. అది అస్సలు మంచిది కాదని ఫ్యామిలీ కౌన్సిలర్లు హెచ్చరిస్తున్నారు. ‘ఎలాంటి గొడవైనా మాట్లాడుకుని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సాయంత్రం ఒక మంచి కాఫీ పెట్టుకుని ఇద్దరూ కూర్చొని మనసు విప్పి మాట్లాడుకుంటే ఏ గొడవైనా ఇట్టే సాల్వ్ అవుతుంది’ అని సూచిస్తున్నారు.
News December 29, 2025
ALERT: పెరగనున్న కార్ల ధరలు!

కొత్త ఏడాదిలో కారు కొనాలనుకునే వారికి వాహన తయారీ సంస్థలు షాకిచ్చాయి. ముడిసరుకుల ధరలు, నిర్వహణ వ్యయం పెరగడంతో జనవరి తొలివారంలో కార్ల ధరలను పెంచేందుకు సిద్ధమయ్యాయి. సుజుకీ, హ్యుందాయ్, MG, టాటా, మహీంద్రా, మెర్సిడెస్ బెంజ్ వంటి సంస్థలు మోడల్‌ను బట్టి 1% నుంచి 3% వరకు ధరలను పెంచే అవకాశం ఉంది. అయితే ఇయర్ ఎండ్ సేల్స్‌లో భాగంగా ఈ సంస్థలు భారీ డిస్కౌంట్స్‌తో అమ్మకాలు జరుపుతున్న విషయం తెలిసిందే.


