News October 12, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 12, ఆదివారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.56 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.08 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.03 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.18 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.56 గంటలకు
✒ ఇష: రాత్రి 7.09 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News October 12, 2025

తురకపాలెం మృతుల కుటుంబాలకు పరిహారం

image

AP: గుంటూరు(D) తురకపాలెంలో మెలియాయిడోసిస్ వ్యాధి లక్షణాలతో మరణించిన వారి కుటుంబాలకు నేడు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించనుంది. మృతుల్లో ఎక్కువ మంది పేదలుండటంతో ఆదుకోవాలని CM చంద్రబాబుకు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు. ఆయన అభ్యర్థనపై స్పందించి మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. మొత్తం 28 కుటుంబాలకు నేడు పెమ్మసాని పరిహారం చెక్కులు పంపిణీ చేయనున్నారు.

News October 12, 2025

సన్‌ఫ్లవర్ గురించి మీకు ఈ విషయం తెలుసా?

image

పొద్దుతిరుగుడు పువ్వులు అన్నీ సూర్యుడు ప్రకాశించే దిశలో కదులుతూ ఉంటాయని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే అది నిజం కాదట. వాస్తవానికి పొద్దుతిరుగుడు తోటలోని లేత పువ్వులు మాత్రమే సూర్యరశ్మికి అనుగుణంగా తూర్పు నుంచి పడమరకు కదులుతూ ఉంటాయట. పెద్ద పొద్దుతిరుగుడు పువ్వుల పొడవాటి కాండం దృఢంగా ఉండటం వల్ల అవి సూర్యకాంతికి అనుగుణంగా కదలడం కష్టమై.. తూర్పు వైపే తిరిగి ఉంటాయట.

News October 12, 2025

ఎయిమ్స్ డియోగర్‌లో ఉద్యోగాలు

image

ఎయిమ్స్ డియోగర్(జార్ఖండ్) 19 నాన్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈనెల 21లోగా ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంటర్, BE, B.Tech, MCA, BSc, డిప్లొమా, MSc మెడికల్ ఫిజిక్స్, MSc(ఫిజిక్స్), AYUSH డిగ్రీ, MSc, MA(సైకాలజీ), BSc(నర్సింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.aiimsdeoghar.edu.in