News October 12, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News October 12, 2025
సతీదేవిని పుట్టింటికి వెళ్లొద్దన్న శివుడు

తండ్రి దక్షుడు చేయనున్న యాగం గురించి విన్న సతీదేవి పుట్టింటికి వెళ్లాలని శివుడి అనుమతి కోరింది. కానీ తనను అవమానించిన దక్షుడి ఇంటికి వెళ్లకూడదంటాడు పరమశివుడు. ఆహ్వానం లేని చోటుకు, శత్రుత్వం ఉన్నవారి ఇంటికి వెళ్తే అవమానం తప్పదని హెచ్చరించాడు. అతిథి లోపాలు వెతికే స్వభావం గలవారితో ఘర్షణ జరుగుతుందని చెప్పాడు. అయినా ఆమె తన పట్టు వదలకుండా తండ్రి ఇంటికి వెళ్లే హక్కు తనకుందని వాదించింది. <<-se>>#Shakthipeetam<<>>
News October 12, 2025
డయాబెటిస్ ఉందా? ఈ ఫ్రూట్స్ ట్రై చేయండి!

డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు కొన్నిరకాల పండ్లు తినొచ్చని, వాటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, జామపండు, ఆపిల్, ఆరెంజ్, కివీ, బొప్పాయి, ద్రాక్ష (కొద్ది మోతాదులో) మంచి ఆప్షన్లు అని అంటున్నారు. వీటిని జ్యూస్ చేసుకునే బదులు పండ్లుగా తింటేనే ఆరోగ్యానికి లాభం అని సూచిస్తున్నారు.
Share it
News October 12, 2025
తురకపాలెం మృతుల కుటుంబాలకు పరిహారం

AP: గుంటూరు(D) తురకపాలెంలో మెలియాయిడోసిస్ వ్యాధి లక్షణాలతో మరణించిన వారి కుటుంబాలకు నేడు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించనుంది. మృతుల్లో ఎక్కువ మంది పేదలుండటంతో ఆదుకోవాలని CM చంద్రబాబుకు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు. ఆయన అభ్యర్థనపై స్పందించి మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. మొత్తం 28 కుటుంబాలకు నేడు పెమ్మసాని పరిహారం చెక్కులు పంపిణీ చేయనున్నారు.