News October 12, 2025
MDK: హైకోర్టు స్టే.. BCల్లో నిరాశ.!

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవోకు హైకోర్టు స్టే విధించడంతో BC వర్గాల్లో నిరాశ నెలకొంది. అదే సమయంలో జనరల్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ZPTC స్థానాల్లో రెండు, మూడు మాత్రమే జనరల్‌కు కేటాయించడంతో వారు ఇప్పటివరకు నిరుత్సాహంలో ఉన్నారు. పాత రిజర్వేషన్లు అమలైతే తమకు పోటీ చేసే అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు.
Similar News
News October 12, 2025
మెదక్: నేడు కాంగ్రెస్ సమావేశానికి ఉత్తరాఖండ్ మహిళా అధ్యక్షురాలు రాక

ఉత్తరాఖండ్ మహిళా అధ్యక్షురాలు, ఏఐసీసీ అబ్జర్వర్ జ్యోతి రౌతేలా ఈనెల 12న మెదక్ వినాయక ఫంక్షన్ హాల్‌లో జరిగే కాంగ్రెస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశానికి హాజరుకానున్నారు. స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో స్టేట్ అబ్జర్వర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, వైస్ ప్రెసిడెంట్ సంగిశెట్టి జగదీశ్ పాల్గొననున్నారు.
News October 11, 2025
MDK: హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు: SP

హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదుతో పాటు రూ. 5 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చినట్లు మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. హవేలిఘనపూర్ PS పరిధిలోని శమ్నాపూర్ వాసి మల్లయ్య(50) దుబాయ్‌లో పనిచేసి ఏడాది క్రితం గ్రామానికి వచ్చాడు. మల్లయ్య భార్య గ్రామంలోని మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఈ కేసు విచారణ పూర్తికాగా నిందితులకు శిక్ష ఖరారైంది.
News October 10, 2025
MDK: స్థానిక ఎన్నికలపై.. చిగురించి ఆవిరైనా ఆశలు

స్థానిక ఎన్నికలపై గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఆశలు చిగురించి ఆవిరైపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ విషయంలో హైకోర్టులో విచారణ ఉండగా జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ ప్రారంభించారు. గురువారం ఉదయం నామినేషన్లు ప్రారంభించడంతో సాయంత్రం హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. దీంతో గ్రామాల ప్రజల్లో ఆశలు చిగురించి ఆవిరయ్యాయి.