News October 12, 2025

ఏటూరునాగారం: శిథిలావస్థకు చేరిన రేషన్ సేల్స్ భవనం

image

ఏటూరునాగారం మండలం దొడ్ల కొత్తూరులో ఏర్పాటు చేసిన డీఆర్ సేల్స్ డిపో శిథిలావస్థకు చేరింది. గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్(ఐఏపీ) నిధులతో గతంలో రేషన్ సరఫరా కోసం భవనాన్ని నిర్మించారు. కాలక్రమేపి భవనం శిథిలావస్థకు చేరడంతో పాటు ప్రధాన ద్వారం షట్టర్ విరిగిపోయింది. దొంగలు, పశువులు భవనంలోకి వెళ్లకుండా నిర్వాహకులు కర్రలను ఏర్పాటు చేశారు. మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Similar News

News October 12, 2025

విశాఖ: ‘మన’వళ్లే అనుకుంటే ముంచేస్తున్నారు..!

image

డబ్బు సంపాదనలో అత్యాశకు పోతున్న యువత పెడదారిన పట్టి సొంతింటికే కన్నాలు వేస్తున్నారు. <<17969023>>కంచరపాలెం<<>>లో 4రోజుల క్రితం నాయనమ్మను స్నేహితులతో బెదిరించి 12తులాల బంగారం, రూ.3లక్షల నగదు కారుతో ఉడాయించిన ఘటన మరవక ముందే అగనంపూడిలో అమ్మమ్మ వద్ద బంగారాన్ని మనవడు తన స్నేహితుడితో <<17982528>>దోపిడీ<<>> చేయించాడు. ఈ రెండు ఘటనల్లో నిందితులు అప్పుల్లో కూరికిపోయినట్లు పోలీసులు గుర్తించారు.

News October 12, 2025

మెదక్: హత్యాచారం.. అసలేం జరిగింది..?

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో సంచలనం సృష్టించిన <<17982015>>గిరిజన మహిళ హత్యాచారం<<>> ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల ప్రాథమిక అంచనా ప్రకారం..పని ఇస్తామని చెప్పి ఇద్దరు వ్యక్తులు మహిళను కొల్చారం(M) పోతంశెట్టిపల్లి, ఏడుపాయల ఆలయ సమీపంలోని ఓ వెంచర్‌కు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేయబోగా అడ్డుకుంది. దీంతో చీరతో చేతులు కట్టేసి అత్యాచారం చేసి, దారుణంగా కొట్టారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయింది.

News October 12, 2025

గ్యాస్ లీక్ ఘటనలో ముగ్గురి మృతి

image

వెల్దుర్తి మండలం బోయనపల్లెలో గత ఆదివారం గ్యాస్ లీకై మంటలు వ్యాపించిన ఘటనలో ముగ్గురు మృతిచెందారు. నాగరాజు, ఆయన భార్య సువర్ణ, పిల్లలు చరణ్, అనిల్‌ తీవ్ర గాయాలతో కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా శుక్రవారం ఉదయం నాగరాజు, అదే రోజు రాత్రి చరణ్ మరణించారు. శనివారం మధ్యాహ్నం వారి అంత్యక్రియలు జరుగుతుండగానే గర్భిణి సువర్ణకు అబార్షన్ అయ్యింది. అనంతరం ఆమె కూడా మరణించింది. అనిల్ చికిత్స పొందతున్నాడు.