News October 12, 2025

కొత్తగూడ: వెంటనే స్పందించిన ఎస్సై

image

కొత్తగూడ మండలం ఎంచగూడెంలో ఇద్దరు చిన్నారులు బావిలో పడి మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, చిన్నారుల ప్రమాద విషయం తెలుసుకొని స్థానిక SI రాజ్ కుమార్ వెంటనే స్పందించారు. ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. చిన్నారులు బావిలో పడిపోయారని తెలుసుకొని వారి ఆచూకీ కోసం మానవత్వంతో స్పందించి వెను వెంటనే గ్రామస్థుల సహకారంతో మృత దేహలను బయటకు తీసుకువచ్చారు. దీంతో మండల ప్రజలు SIని అభినందిస్తున్నారు.

Similar News

News October 12, 2025

నల్గొండ: 106 మంది నుంచి రూ.46 కోట్లు?

image

అధిక వడ్డీ ఆశ చూపి అమాయక ప్రజలను మోసం చేసిన వడ్డీ వ్యాపారి బాలాజీపై గుడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పెద్దఅడిశర్లపల్లి మండలంలోని పలు గ్రామాల నుంచి సుమారు 12 మంది భాధితుల ఫిర్యాదు చేసినట్లు గుడిపల్లి పోలీసులు తెలిపారు. అతని సెల్‌ఫోన్లో ఉన్న సమాచారం ఆధారంగా 106 మంది నుంచి రూ.46 కోట్లు తీసుకున్నట్లు ప్రాథమికంగా తేలింది.

News October 12, 2025

మచిలీపట్నంలో నేటి నాన్ వెజ్ ధరలు ఇవే.!

image

మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఇలా ఉన్నాయి. కేజీ చికెన్ ధర రూ. 200 ఉండగా స్కిన్‌లెస్ రూ. 220కి విక్రయిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విత్ స్కిన్ కేజీ రూ. 220, స్కిన్‌లెస్ కేజీ రూ. 240కి అమ్ముతున్నారు. అదే విధంగా మటన్ పల్లె ప్రాంతాల్లో కిలో ధర రూ. 800 ఉండగా.. పట్టణంలో కేజీ మటన్ ధర రూ.1000గా ఉంది. మరి మీ ప్రాంతంలో ధరలు ఏవిధంగా ఉన్నాయో కామెంట్ చేయండి.

News October 12, 2025

SRPT: 93 మద్యం దుకాణాలకు 81 దరఖాస్తులే

image

తెలంగాణలో కొత్త మద్యం దుకాణాల నిర్వహణ కోసం ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 18 వరకు మద్యం దుకాణాలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరించనున్నారు. అయితే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 93 మధ్య దుకాణాలు ఉండగా శనివారం నాటికి 81 దరఖాస్తులు మాత్రమే దాఖలయ్యాయి. SRPT 39, కోదాడ 18, తుంగతుర్తి 19, హుజూర్ నగర్ అత్యంత స్వల్పంగా 5 దరఖాస్తులు మాత్రమే రావడం గమనార్హం.