News October 12, 2025

2027 వరల్డ్ కప్ ఆడాలని ఉంది: జడేజా

image

తనను ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంపై ముందే చర్చించారని టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ జడేజా పేర్కొన్నారు. ‘నా సెలక్షన్‌పై మేనేజ్మెంట్, కోచ్, కెప్టెన్, సెలక్టర్లు డెసిషన్ తీసుకున్నారు. కారణాలేంటో నాకు చెప్పారు. 2027 WCకంటే ముందు కొన్ని వన్డేలు ఉన్నాయి. అవకాశం వచ్చినప్పుడల్లా పర్ఫార్మ్ చేసి వరల్డ్ కప్ టీమ్‌లో ప్లేస్ సాధించే ప్రయత్నం చేస్తా. ప్రపంచ కప్ కలను నిజం చేసుకుంటాను’ అని తెలిపారు.

Similar News

News October 12, 2025

ఆనంద్‌కు క్షమాపణలు చెప్పిన కాస్పరోవ్

image

క్లచ్ చెస్ టోర్నీలో విశ్వనాథ్ ఆనంద్‌పై రష్యన్ ప్లేయర్ కాస్పరోవ్ 13-11తో విజయం సాధించారు. రెండో రోజు తొలి ర్యాపిడ్ గేమ్‌లో గెలిచే స్థితిలో ఉన్నప్పటికీ ఆనంద్ ఓడిపోయారు. తాను టైమ్ ముగిశాక చెప్పడం వల్లే ఇది జరిగిందని, ఇందుకు ఆనంద్‌కు క్షమాపణలు చెప్పినట్లు కాస్పరోవ్ తెలిపారు. తాను శిక్షకు అర్హుడినని పేర్కొన్నారు. కాగా విజేతగా నిలిచిన కాస్పరోవ్ రూ.69 లక్షలు, ఆనంద్ రూ.58.55 లక్షల బహుమతి అందుకున్నారు.

News October 12, 2025

AP న్యూస్ అప్డేట్స్

image

* విజయవాడ – సింగపూర్ విమాన సర్వీస్ NOV 15 నుంచి తిరిగి ప్రారంభం
* ఆఫ్రికాలో కల్తీ మద్యం వ్యాపారం చేసింది జగన్ బినామీలే: TDP నేత వర్ల రామయ్య
* PPP మెడికల్ కాలేజీలు నిలిపివేయాలని హైకోర్టులో BSP PIL దాఖలు
* జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 1500మీ. రన్నింగ్‌లో గోల్డ్ గెలిచిన వెంకట్రామ్ రెడ్డి (కర్నూలు), 100మీ. హర్డిల్స్‌లో రోషన్‌కు (గుంటూరు) సిల్వర్

News October 12, 2025

రూపాయికే కూరగాయల మొక్క.. మనకూ కావాలి!

image

ఉద్యానవన పంటలను ప్రోత్సహించడానికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రైతులకు రూపాయికే కూరగాయల మొక్కలను అందిస్తోంది. ఇందుకోసం సుర్గుజా(D)లో విత్తనాల యూనిట్ నెలకొల్పింది. అన్నదాతలు తమకు నచ్చిన సీడ్స్ ఆ యూనిట్‌కు ఇస్తే సాంకేతికత సాయంతో నాణ్యమైన మొక్కలుగా తయారుచేసి రూ.1కే అందిస్తోంది. ఇలాంటి పథకం AP, TGలోనూ ఉంటే ఉపయోగకరంగా ఉంటుంది. ఏమంటారు?
* అగ్రికల్చర్ కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.