News October 12, 2025

విదేశీ పర్యటనలకు ప్రభుత్వ టీచర్లు

image

TG: ప్రభుత్వ టీచర్లు, హెడ్ మాస్టర్స్, ప్రిన్సిపల్స్ కోసం ప్రభుత్వం అంతర్జాతీయ ఎక్స్‌పోజర్ సందర్శనలు, విద్యా మార్పిడి కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ ఏడాది OCT, NOVలో టీచర్స్ సింగపూర్, ఫిన్లాండ్, వియత్నాం, జపాన్‌ను సందర్శిస్తారు. జిల్లా నుంచి ముగ్గురు చొప్పున విదేశీ పర్యటనకు కలెక్టర్లు ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేస్తారు. సుమారు 160మంది టీచర్స్‌ను 4 బ్యాచులుగా విదేశాలకు పంపుతారు.

Similar News

News October 12, 2025

తిరుమలలో రద్దీ.. దర్శనానికి 24 గంటలు

image

AP: తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి శిలాతోరణం వరకు భక్తులు క్యూలలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని వారికి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న 84,571 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. హుండీకి రూ.3.70 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది.

News October 12, 2025

వరిలో పాముపొడ, ఆకుముడత తెగుళ్లు.. నివారణ

image

ముందుగా సాగుచేసిన వరిలో పాముపొడ తెగులు కనిపిస్తోంది. దీని నివారణకు ఎకరానికి 400 మి.లీ హెక్సాకొనజోల్ 5 SP లేదా 400 మి.లీ వాలిడామైసిన్ 3 SL లేదా 200 మి.లీ ప్రోపికొనజోల్ 25 శాతం EC వంటి మందులను పిచికారీ చేసుకోవాలి. ఆకుముడత, కాండం తొలుచు పురుగుల నివారణకు ఎకరానికి కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 400గ్రా. లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 60 మి.లీ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

News October 12, 2025

పరీక్ష రాశాక ఆన్సర్ షీట్ చూసుకోవచ్చు

image

పోటీ పరీక్షల్లో పారదర్శకత కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ముఖ్య సంస్కరణలు చేసింది. ఇకపై మెరిట్ లిస్టును మార్కులుగా కాకుండా పర్సంటైల్‌గా వెల్లడిస్తుంది. అటు పేపర్ లీకేజీలు జరగకుండా డిజిటల్ వాల్టులు వినియోగించనుంది. ఇక ఆధార్ గుర్తింపుతో అభ్యర్థుల అటెండెన్స్ తీసుకుంటుంది. ముఖ్యంగా ఎగ్జామ్‌లో తమకు వచ్చిన క్వశ్చన్ పేపర్, ఇచ్చిన ఆన్సర్స్, కీ కాపీలను పరీక్ష తర్వాత ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చని తెలిపింది.