News October 12, 2025
ఫేక్ ఫొటోలపై పవన్ హీరోయిన్ ఫైర్

తన ఫేక్ ఫొటోలు వైరల్ చేయడంపై OG మూవీ హీరోయిన్ ప్రియాంక మోహన్ ఫైర్ అయ్యారు. ‘నన్ను తప్పుగా చిత్రీకరించిన కొన్ని AI జెనరేటెడ్ ఫొటోలు వైరలవుతున్నాయి. దయచేసి అలాంటివి షేర్ చేయడం, స్ప్రెడ్ చేయడం ఆపేయండి. టెక్నాలజీని కేవలం ఎథికల్ క్రియేటివిటీకి మాత్రమే వినియోగించాలి. ఏం క్రియేట్ చేస్తున్నాం? ఎలాంటివి షేర్ చేస్తున్నాం అనే విషయంలో మాత్రం అందరూ కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి’ అని ట్వీట్ చేశారు.
Similar News
News October 12, 2025
నారద భక్తి సూత్రాలు – 6

‘యత్ జ్ఞాత్వా మత్తో భవతి, స్తబ్ధో భవతి, ఆత్మారామోభవతి’ అనే దివ్య వాక్యం భక్తి ఉన్నత స్థితిని వివరిస్తుంది. దేనిని తెలుసుకుంటే భక్తుడు నిశ్చలమైనవాడై ఆత్మలోనే ఆనందాన్ని పొందుతాడో అదే ‘భగవత్ ప్రేమ’. అది కల్గినవారికి లౌకిక విషయాలపై వ్యామోహం పోయి, మనసు స్థిరత్వం పొందుతుంది. భగవంతుడి జ్ఞానాన్ని పొందిన భక్తుడు, తన సంతోషం కోసం బాహ్య ప్రపంచంపై ఆధారపడకుండా, ఆత్మలోనే శాశ్వతమైన ఆనందాన్ని పొందుతాడు. <<-se>>#NBS<<>>
News October 12, 2025
‘గాడ్ ఫాదర్’ నటి, ఆస్కార్ విన్నర్ కన్నుమూత

ఆస్కార్ నటి డయాన్ కీటన్(79) కన్నుమూశారు. కాలిఫోర్నియాలోని నివాసంలో ఆమె మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మరణానికి కారణాలు వెల్లడించలేదు. కీటన్ హాలీవుడ్ ఫేమస్ మూవీ ‘ది గాడ్ ఫాదర్’(1972) చిత్రంతో ‘కే ఆడమ్స్’ పాత్రతో ఆమె వెలుగులోకి వచ్చారు. సీక్వెల్‌లోనూ డయాన్ నటించారు. ‘ఆనీ హాల్’(1977) చిత్రంలో నటనకుగాను ఆస్కార్ అందుకున్నారు. దాదాపు 50ఏళ్ల పాటు సినిమాల్లో నటించారు.
News October 12, 2025
తిరుమలలో రద్దీ.. దర్శనానికి 24 గంటలు

AP: తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి శిలాతోరణం వరకు భక్తులు క్యూలలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని వారికి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న 84,571 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. హుండీకి రూ.3.70 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది.