News October 12, 2025

సంగారెడ్డి: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ మేళా

image

కంది మండలం ఎద్దుమైలారం పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 2025-26కు సంబంధించి అర్హులైన ఐటీఐ అభ్యర్థులకు వివిధ ట్రెడ్‌లలో 304 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 17న జిల్లా కేంద్రంలోని ఐటీఐ సెంటర్‌లో నిర్వహించే జాబ్ మేళాకు జిల్లా పరిసర ప్రాంతాల విద్యార్థులు తమ సర్టిఫికేట్స్‌తో హజరై ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కంపెనీ డైరెక్టర్ అలోక్ ప్రసాద్ తెలిపారు.

Similar News

News October 12, 2025

HYD: రెండు రోజులు నీటి సరఫరా బంద్

image

కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు ఫేజ్-3 పంపింగ్‌కు సంబంధించి భారీ లీకేజీకి మరమ్మతులు చేయనున్న నేపథ్యంలో రేపు, ఎల్లుండి పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనుందని జలమండలి అధికారులు తెలిపారు. కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, వనస్థలిపురం, ఉప్పల్, రాంపల్లి, బోడుప్పల్, సరూర్‌నగర్, బండ్లగూడ, ఉప్పల్, శంషాబాద్, నాగోల్ ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.

News October 12, 2025

నారద భక్తి సూత్రాలు – 6

image

‘యత్‌ జ్ఞాత్వా మత్తో భవతి, స్తబ్ధో భవతి, ఆత్మారామోభవతి’ అనే దివ్య వాక్యం భక్తి ఉన్నత స్థితిని వివరిస్తుంది. దేనిని తెలుసుకుంటే భక్తుడు నిశ్చలమైనవాడై ఆత్మలోనే ఆనందాన్ని పొందుతాడో అదే ‘భగవత్ ప్రేమ’. అది కల్గినవారికి లౌకిక విషయాలపై వ్యామోహం పోయి, మనసు స్థిరత్వం పొందుతుంది. భగవంతుడి జ్ఞానాన్ని పొందిన భక్తుడు, తన సంతోషం కోసం బాహ్య ప్రపంచంపై ఆధారపడకుండా, ఆత్మలోనే శాశ్వతమైన ఆనందాన్ని పొందుతాడు. <<-se>>#NBS<<>>

News October 12, 2025

‘గాడ్ ఫాదర్’ నటి, ఆస్కార్ విన్నర్ కన్నుమూత

image

ఆస్కార్ నటి డయాన్ కీటన్(79) కన్నుమూశారు. కాలిఫోర్నియాలోని నివాసంలో ఆమె మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మరణానికి కారణాలు వెల్లడించలేదు. కీటన్ హాలీవుడ్ ఫేమస్ మూవీ ‘ది గాడ్ ఫాదర్’(1972) చిత్రంతో ‘కే ఆడమ్స్’ పాత్రతో ఆమె వెలుగులోకి వచ్చారు. సీక్వెల్‌లోనూ డయాన్ నటించారు. ‘ఆనీ హాల్’(1977) చిత్రంలో నటనకుగాను ఆస్కార్ అందుకున్నారు. దాదాపు 50ఏళ్ల పాటు సినిమాల్లో నటించారు.