News October 12, 2025

బోలెడు ఆఫర్లతో JIO దీపావళి రీఛార్జ్ ప్లాన్

image

రిలయన్స్ జియో సంస్థ దీపావళి, ధంతేరాస్ సందర్భంగా రూ.349తో స్పెషల్ రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. 28 డేస్ వ్యాలిడిటీ, డైలీ 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 SMSలు ఉంటాయి. వీటికి అదనంగా 3 నెలల జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్(మొబైల్/TV ), ఫ్రీగా 50GB జియో క్లౌడ్ స్టోరేజ్ లభిస్తుంది. హోమ్ ఇంటర్నెట్, స్మార్ట్ డివైజెస్, ఎంటర్‌టైన్మెంట్ సేవలు కలిగిన జియో హోమ్ ఫ్రీ ట్రైల్ 2 నెలలు పొందొచ్చు.

Similar News

News October 12, 2025

దీపావళి బరిలో నాలుగు సినిమాలు

image

ఈ సారి దీపావళికి బడా హీరోల మూవీలు బరిలో లేవు. దీంతో మీడియం, చిన్న సినిమాలే పోటీ పడుతున్నాయి. తెలుగులో 4 సినిమాలు విడుదల కానున్నాయి. ప్రియదర్శి, నిహారిక నటించిన ‘మిత్రమండలి’(16), సిద్ధూ జొన్నలగడ్డ ‘తెలుసుకదా’(17), ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’(17), కిరణ్ అబ్బవరం నటించిన ‘K-Ramp’(18) బరిలో ఉన్నాయి. ఈ చిత్రాల నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్స్‌కు మంచి స్పందన వచ్చింది. మీరు ఏ సినిమాకు వెళ్తున్నారు?

News October 12, 2025

అనుబంధాల ఆలయమే పెళ్లి

image

పెళ్లంటే నూరేళ్ల పంట మాత్రమే కాదు. ఏడడుగుల అనుబంధం. ఏడు జన్మల అనురాగం. ఇది రెండు మనసుల పవిత్ర కలయిక. ఇరువురి జీవితాల ప్రేమానురాగాల అల్లిక. తల్లిదండ్రులను మురిపించి, రెండు కుటుంబాల సంతృప్తిని కొనసాగించే గొప్ప సంస్కారం. శాంతి సౌభాగ్యాల ఉద్భవానికి, ‘నా’ అనే తీయని భావనతో కుటుంబాన్ని ఏర్పాటుచేసుకొనే మొదటి సోపానం. ఓర్పు, సహనం అనే పునాదులపై నిర్మితమయ్యే అందమైన అనుబంధాల సౌధమే వివాహం. <<-se>>#Pendli<<>>

News October 12, 2025

బిగ్ బాస్‌-9లోకి దువ్వాడ సన్నిహితురాలు

image

AP ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు దివ్వెల మాధవి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో రావాలని బిగ్ బాస్ మేనేజ్మెంట్ కోరినట్లు దువ్వాడ చెప్పారు. ‘ఇప్పటివరకు బిగ్ బాస్ ఒక లెక్క. ఈ రోజు నుంచి బిగ్ బాస్ 2.0 చూడబోతున్నారు’ అని అన్నారు. మరి ఒక్కరికే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారా? అనేది ఇవాళ 9pmకు క్లారిటీ రానుంది. అటు ఈ వారం ఇద్దరు ఎలిమినేటర్ అవుతారని సమాచారం.