News October 12, 2025

KMR: అధ్యయనానికి దరఖాస్తులు ఆహ్వానం!

image

విదేశీ విద్యా విధానం అధ్యయనం కోసం ప్రభుత్వ, స్థానిక సంస్థలు, మోడల్ స్కూల్, TGRIES పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు DEO రాజు తెలిపారు. కనీసం 10 సంవత్సరాల బోధనానుభవం కలిగి, 55 సంవత్సరాల లోపు ఉన్న, చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ ఉన్నవారు అర్హులన్నారు. అర్హత గల వారు దరఖాస్తులను ఈ నెల 14వ తేదీ సా. 4 గంటలలోపు DEO కార్యాలయంలో అందజేయాలన్నారు.

Similar News

News October 12, 2025

భద్రాచలం: పాపికొండల పర్యాటకం పునః ప్రారంభం

image

జాతీయస్థాయిలో పేరుగాంచిన పాపికొండల విహార యాత్ర అధికారికంగా పునః ప్రారంభమైంది. ఏపీలోని రాజమండ్రి సమీపంలోని గండిపోచమ్మ ఫెర్రీ పాయింట్‌ నుంచి బోట్లు ఇప్పటికే శనివారం నుంచి ప్రయాణించాయి. కాగా, తెలంగాణ పర్యాటకుల కోసం ఏపీలోని పోచారం నుంచి కూడా బోట్లు ఈ వారంలోనే పునః ప్రారంభం కానున్నట్లు బోటు యజమానులు పేర్కొంటున్నారు. దీంతో పర్యాటక ప్రాంతంలో సందడి నెలకొంది.

News October 12, 2025

WGL: తస్మాత్ జాగ్రత్త.. పాత ఫోన్లను అమ్మకండి!

image

మీ ఇంట్లో వినియోగించి వదిలేసిన పాత ఫోన్లను ప్లాస్టిక్ సామాన్లకు, మొబైల్ షాపుల్లో, ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముతున్నారా? అయితే మీరు సైబర్ నేరగాళ్లకు చిక్కినట్లే. వాటి ఐఎంఈఐ నంబర్లు, మదర్ బోర్డు, సాఫ్ట్వేర్ సేకరించి మరమ్మతు చేస్తారు. ఆ తర్వాత ఆ ఫోన్ల ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. కావున వీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ విభాగం పోలీస్ అధికారులు సూచిస్తున్నారు.

News October 12, 2025

ADB: సామాన్యుడి ఆయుధం.. RTI ACT

image

పాలనలో పారద్శకత, అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నించడానికి పౌరులకు అధికారం ఇస్తుంది సమాచార హక్కు చట్టం. సమాచారాన్ని అందించడానికి బాధ్యత వహించే అధికారులు ప్రభుత్వ వ్యవస్థల్లో ఉంటారు. నిర్మల్ జిల్లాకు చెందిన ఓ సాధారణ వ్యక్తి స.హ చట్టం ద్వారా ఉపాధి పనుల్లో, అధికారుల సంతకాల పోర్జరీ వంటి విషయాలు వెలుగులోకి తెచ్చాడు. చట్టం గురించి ప్రజలకు తెలియజేయడానికి OCT5-12వరకు సహ చట్టం వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.