News October 12, 2025
బిట్‌కాయిన్, క్రిప్టో మోసాలపై జాగ్రత్త: ఎస్పీ

బిట్‌కాయిన్, క్రిప్టో మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. బిట్‌కాయిన్ పెట్టుబడుల పేరుతో మోసాలు జరుగుతున్నాయన్నారు. మీకు లింకులు పంపితే, వాటిని తెరవవద్దు అన్నారు. సైబర్ మోసం జరిగినట్లయితే వెంటనే 1930 (సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్) లేదా www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని సూచించారు.
Similar News
News October 12, 2025
బతుకు బండి.. పొంచి ఉన్న ప్రమాదం

ఆస్పరి, దేవనకొండ మండలాల్లో పత్తి సీజన్ ప్రారంభమైంది. పత్తి తీయడానికి రోజూ వందలాది మంది ట్రాక్టర్లు, ఆటోలలో కిక్కిరిసిపోయి ప్రయాణిస్తున్నారు. డ్రైవర్ల నిర్లక్ష్యం, ఓవర్ లోడింగ్ కారణంగా ఈ ప్రయాణం యమపాశంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రమాదం సంభవిస్తుందోనన్న భయం కూలీలను వెంటాడుతోంది. పోలీసుల నిర్లక్ష్యం, నియంత్రణ లోపం స్పష్టంగా కనిపిస్తోందని గ్రామస్థులు విమర్శిస్తున్నారు.
News October 11, 2025
చేపల వినియోగం పెంపునకు ప్రాధాన్యం: మంత్రి టీజీ భరత్

చేపల వినియోగం పెంచేందుకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద యూనిట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. శనివారం నన్నూరు టోల్‌గేట్ వద్ద పాణ్యం ఎమ్మెల్యే చరిత, కలెక్టర్ డా.ఏ.సిరితో కలిసి చేపల విలువ ఆధారిత యూనిట్‌ను ప్రారంభించారు. మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యమని ఆయన చెప్పారు. రూ.50 లక్షలతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌లో 60శాతం సబ్సిడీ ప్రభుత్వం కల్పిస్తుందన్నారు.
News October 11, 2025
కర్నూలు జిల్లా పత్తి రైతులకు శుభవార్త

కర్నూలు జిల్లా పత్తి రైతులకు జేసీ డా.నవ్య శుభవార్త చెప్పారు. శుక్రవారం మార్కెటింగ్ శాఖ, సీసీఐ అధికారులతో సమావేశం నిర్వహించిన ఆమె ప్రభుత్వం నిర్ణయించిన క్వింటాల్‌కు రూ.8,060 మద్దతు ధరకు పత్తి కొనుగోలు ప్రారంభించాలంటూ ఆదేశించారు. రైతులు పత్తి విక్రయానికి ఆదోని 9182361164, ఎమ్మిగనూరు 9182361166, మంత్రాలయం 8328682823, కోడుమూరు 9705556596 నంబర్లను సంప్రదించాలని సూచించారు.