News October 12, 2025
దేవుడు ఎవరికి కనిపిస్తాడంటే?

బ్రాహ్మణులకు, యజ్ఞాలు చేసేవారికి అగ్నియే దేవుడు. ధ్యానం చేసే మునులకు హృదయమే దేవుడు. అల్పబుద్ధి గల సామాన్యులు విగ్రహాలను దైవంగా భావిస్తారు. అయితే సమదృష్టి గల మహాత్ములు మాత్రం అన్ని చోట్లా దేవుణ్ని చూడగలుగుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. సర్వం దైవ స్వరూపమే అని గ్రహించిన వారికి సకలమూ దైవమయంగా, ఆనందమయంగా కనిపిస్తుంది. వారికి నిజమైన జ్ఞానం సిద్ధిస్తుంది. <<-se>>#WhoIsGod<<>>
Similar News
News October 12, 2025
అధిక పోషకాల పంట ‘ఎర్ర బెండ’

సాధారణంగా దేశీయ బెండ(లావుగా, పొట్టిగా), హైబ్రిడ్ బెండ రకాలు ఆకుపచ్చగా (లేదా) లేత ఆకుపచ్చగా ఉండటం గమనిస్తాం. కానీ ఎర్ర బెండకాయలను కూడా సాగు చేస్తారని తెలుసా. ‘ఆంతో సయనిన్’ అనే వర్ణ పదార్థం వల్ల ఈ బెండ కాయలు, కాండం, ఆకు తొడిమెలు, ఆకు ఈనెలు ఎర్రగా ఉంటాయి. ఆకుపచ్చ బెండ కంటే వీటిలో పోషకాల మోతాదు ఎక్కువ. ఎర్ర బెండలో ‘కాశి లాలిమ’, ‘పూసా రెడ్ బెండి-1’ రకాలు అధిక దిగుబడినిస్తాయి.
News October 12, 2025
విశాఖకు రైడెన్.. ₹22 వేల కోట్ల రాయితీలు!

AP: గూగుల్ అనుబంధ సంస్థ Raiden Infotech వైజాగ్‌లో రూ.87,520 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైడెన్‌కు భారీ సబ్సిడీలు ప్రకటిస్తూ ఉత్తర్వులిచ్చింది. భూమి విలువపై 25% డిస్కౌంట్‌తో 480 ఎకరాలు, జీఎస్టీపై సబ్సిడీ, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల మినహాయింపు, నీరు, విద్యుత్ వాడకంపై రాయితీతో సహా మొత్తంగా ₹22 వేల కోట్లకు పైగా ప్రోత్సాహకాలు ఇవ్వనుంది.
News October 12, 2025
ఎర్ర బెండ రకాల్లో ‘కాశీ లాలిమ’ ప్రత్యేకం

‘కాశీ లాలిమ’ ఎర్ర బెండను IIVR వారణాసి రూపొందించింది. ఈ కాయలు ఆకర్షణీయంగా ఉంటాయి. దీనికి కాయపుచ్చు పురుగు ముప్పు తక్కువ. దీని వల్ల పురుగు మందుల పిచికారీ అవసరం లేదు. చెట్టు పొట్టిగా ఉంటుంది. అందకే దగ్గర దగ్గరగా మొక్కలు నాటుకోవాలి. కాయపై దురద కలిగించే నూగు ఉండదు. అందుకే ఈ బెండ కాయలను సులభంగా కోయవచ్చు. పల్లాకు వైరస్ తెగులును ఇది సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఈ కాయల్లో జిగురు తక్కువగా ఉంటుంది.