News October 12, 2025
నేడు విశాఖలో డేటా సెంటర్‌కు లోకేశ్ శంకుస్థాపన

AP: మంత్రి లోకేశ్ ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. సిఫీ AI డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేయనున్నారు. నాస్‌డాక్‌లో నమోదైన ప్రముఖ డిజిటల్ IT కంపెనీ సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థే ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్. ఇది రూ.1500 కోట్లతో రెండు దశల్లో 50 మెగావాట్ల AI ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటు చేయనుంది. దీంతో వెయ్యి మందికి ఉపాధి లభించనుంది.
Similar News
News October 12, 2025
తిరుమలలో పెరిగిన రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లు నిండిపోయి భక్తుల క్యూ లైన్ శిలాతోరణం వరకు దాటిపోయింది. నిన్న 84,571 మంది స్వామివారిని దర్శించుకున్నారు. కానుకల రూపంలో ₹3.70 కోట్లు సమర్పించారు. 36,711 మంది తలనీలాలు అర్పించారు. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు దర్శనానికి 20 గంటలు పడుతోంది. సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారు కేటాయించిన సమయానికి మాత్రమే క్యూలోకి రావాలని టీటీడీ సూచించింది.
News October 12, 2025
HSCC లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

హాస్పిటల్ సర్వీసెస్ కన్సల్టెన్సీ కార్పొరేషన్(HSCC)లిమిటెడ్‌లో 27 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఎంబీఏ, ఇంజినీరింగ్ డిగ్రీ, ఫార్మసీ డిగ్రీ, పీజీ డిప్లొమా, LLB ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇంజినీరింగ్ పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్: http://hsccltd.co.in/
News October 12, 2025
దీపావళి ఆఫర్లు ప్రకటించిన టాటా, హ్యుందాయ్

దీపావళి సందర్భంగా పలు ఆటోమొబైల్ కంపెనీలు ఆఫర్లు ప్రకటించాయి. అక్టోబర్ 21 వరకు క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్‌ఛైంజ్ ఆఫర్లు, లాయల్టీ బోనస్‌లు ఉంటాయని టాటా మోటార్స్ తెలిపింది. టియాగోపై రూ.20-30వేలు, నెక్సాన్‌పై రూ.35వేలు, పంచ్‌పై రూ.25వేలు డిస్కౌంట్ ఇస్తున్నట్లు పేర్కొంది. అటు హ్యుందాయ్ కంపెనీ సైతం వివిధ కార్లపై ఆఫర్లు ప్రకటించింది. జీఎస్టీ తగ్గింపు, తాజా డిస్కౌంట్లతో కార్ల ధరలు భారీగా తగ్గనున్నాయి.