News October 12, 2025
సన్‌ఫ్లవర్ గురించి మీకు ఈ విషయం తెలుసా?

పొద్దుతిరుగుడు పువ్వులు అన్నీ సూర్యుడు ప్రకాశించే దిశలో కదులుతూ ఉంటాయని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే అది నిజం కాదట. వాస్తవానికి పొద్దుతిరుగుడు తోటలోని లేత పువ్వులు మాత్రమే సూర్యరశ్మికి అనుగుణంగా తూర్పు నుంచి పడమరకు కదులుతూ ఉంటాయట. పెద్ద పొద్దుతిరుగుడు పువ్వుల పొడవాటి కాండం దృఢంగా ఉండటం వల్ల అవి సూర్యకాంతికి అనుగుణంగా కదలడం కష్టమై.. తూర్పు వైపే తిరిగి ఉంటాయట.
Similar News
News October 12, 2025
మా బౌలర్లను అంతలా బాదకు జైస్వాల్.. లారా రిక్వెస్ట్

భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్ రెండో టెస్టులో 175 పరుగులతో వెస్టిండీస్ బౌలర్లను వణికించిన సంగతి తెలిసిందే. నిన్న ఆట ముగిసిన తర్వాత విండీస్ దిగ్గజ బ్యాటర్ లారా మైదానంలో యశస్వీని కలిసి కంగ్రాట్స్ చెప్పారు. ‘మా బౌలర్లను అంతలా బాదకు’ అని లారా వ్యాఖ్యానించగా.. ‘లేదు సర్. ట్రై చేస్తున్నా’ అని జైస్వాల్ అన్నారని BCCI <
News October 12, 2025
368 ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

దేశంలోని అన్ని రైల్వే జోన్లలో 368 సెక్షన్ కంట్రోలర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ( OCT 14)ఆఖరు తేదీ. డిగ్రీ పాసై, 20-33 ఏళ్ల వయసున్న అభ్యర్థులు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి వయోపరిమితిలో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, మహిళలు, దివ్యాంగులకు రూ.250. ఆన్‌లైన్ పరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.rrbapply.gov.in/
News October 12, 2025
ట్రంప్ టారిఫ్స్.. చైనా స్ట్రాంగ్ వార్నింగ్

చైనా దిగుమతులపై NOV 1 నుంచి అదనంగా 100% టారిఫ్స్ విధిస్తున్నట్లు US అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనపై చైనా దీటుగా స్పందించింది. ‘USవి ద్వంద్వ ప్రమాణాలు. ఈ చర్యలు మా దేశ ప్రయోజనాలకు తీవ్ర హాని చేస్తాయి. ఆర్థిక, వాణిజ్య చర్చలకు విఘాతం కలిగిస్తాయి. మేం ఫైట్ చేయాలని అనుకోవడం లేదు. అలాగని గొడవకు భయపడం’ అని చైనా కామర్స్ మినిస్ట్రీ స్పష్టం చేసింది. చర్యకు ప్రతి చర్య ఉంటుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.